Who is Rani : ప్రభాస్ కు 'రాణి'తో ఏంటి సంబంధం.. కొత్త అనుమానాలు రేపిన గోపీచంద్!

 Rani Related to Prabhas: తాజాగా అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే అనే షోలో పాల్గొన్న ప్రభాస్ గురించి గోపీచంద్ ఒక ఆసక్తికరమైన విషయం బయట పెట్టారు, రాణి అనే పేరు తెర మీదకు తీసుకురావడంతో అసలు ఆమె ఎవరు అనే చర్చ మొదలైంది. 

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 17, 2022, 07:54 PM IST
Who is Rani : ప్రభాస్ కు 'రాణి'తో ఏంటి సంబంధం.. కొత్త అనుమానాలు రేపిన గోపీచంద్!

Who is Rani For Prabhas: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా వీడియో ప్లాట్ ఫామ్ లో అన్ స్టాపబుల్ అనే ఒక టాక్ షో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విజయవంతంగా ఒక సీజన్ పూర్తి చేసుకున్న ఈ టాక్ షో కి సంబంధించిన సెకండ్ సీజన్ ప్రస్తుతం విజయవంతంగా సాగుతోంది ఇక ఇప్పటికే ఈ సెకండ్ సీజన్ లో అనేక సంచలన కాంబినేషన్లను సెట్ చేసి ప్రేక్షకులందరినీ అలరించిన నందమూరి బాలకృష్ణ ఈసారి ప్రభాస్ గోపీచంద్ తో ఒక ఎపిసోడ్ చేస్తున్నట్లుగా ముందుగానే హింట్ ఇచ్చారు.

దానికి సంబంధించిన కొన్ని ప్రోమోలు కూడా ఇప్పటికే విడుదలయ్యాయి. తాజాగా మూడున్నర నిమిషాల పాటు సాగుతున్న మరో పెద్ద ప్రోమో విడుదల చేశారు మేకర్స్. ఈ ప్రోమో కనుక మనం చూసినట్లయితే బాలకృష్ణ ఎప్పటిలాగానే తనదైన శైలిలో ప్రభాస్ తో సందడి చేసే ప్రయత్నం చేశారు. వర్షం సినిమా సమయంలో ప్రభాస్ గోపీచంద్ మధ్య సాన్నిహిత్య సంబంధం ఏర్పడింది. దీంతో వీరిద్దరూ అప్పటి నుంచే మంచి స్నేహితులుగా ఉన్నారు.

ఈ క్రమంలోనే వీరిద్దరూ తమ మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని బయటపెట్టారు. అదేవిధంగా షో మధ్యలోనే ఒక ప్రశ్న విషయంలో రామ్ చరణ్ కి బాలకృష్ణ ఫోన్ చేయడంతో రామ్ చరణ్ ప్రభాస్ సీక్రెట్ ఒకటి బయట పెట్టారు. దీంతో ప్రభాస్ అనే చరణ్ నువ్వు నా ఫ్రెండ్ గా శత్రువుగా అంటూ చిరు కోపం ప్రదర్శించడం హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత గోపీచంద్ వచ్చిన తర్వాత నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని అడిగితే రామ్ చరణ్ పేరు చెప్పాడని నీ పేరు చెప్పలేదని బాలకృష్ణ వారిద్దరి మధ్య లిటిగేషన్ పెట్టే ప్రయత్నం చేశారు. అయితే దాని నుంచి ప్రభాస్ బాగానే డైవర్ట్ చేశారు.

అయితే బాలకృష్ణ చరణ్ ఒక రహస్యం చెప్పాడని చెప్పడంతో ఎవరు ఆ రాణి గురించేనా అంటూ గోపీచంద్ ప్రశ్నించడంతో అసలు ఎవరు ఈ రాణి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. బహుశా ప్రభాస్ సీక్రెట్ లవర్ ఏమో అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే ప్రభాస్ అలాంటివాడు కాదని అమ్మాయిలు జోలికే వెళ్లేవాడు కాదని అంటున్నారు. మొత్తం మీద ఈ రాణి ఎవరో తెలియదు కానీ మొత్తం మీద ఆమె పేరు మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పకతప్పదు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 
 
 

Trending News