నాగబాబు కూతురు నిహారిక ఎంగేజ్‌మెంట్ ఫోటోలు ( Niharika’s engagement ) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి కుటుంబసభ్యులు ( Chiranjeevi family ) అందరూ నిహారిక నిశ్చితార్థం వేడుకలో పాల్గొని సందడి చేశారు. నిహారిక ఎంగేజ్‌మెంట్ ఫోటోల్లో మెగా ఫ్యామిలీ నుంచి ఒక్క పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) తప్ప మిగతా అందరూ కనిపించారు. అది చూసిన నెటిజెన్స్ రకరకాలుగా చర్చించుకోవడం ప్రారంభించారు. నిహారిక ఎంగేజ్‌మెంట్ వేడుకకు పవన్ కల్యాణ్ ఎందుకు హాజరు కాలేదనే సందేహం సోషల్ మీడియాలో అభిమానుల పట్ల ఓ పెద్ద డిబేట్‌గా మారింది. Niharika engagement photos : నిహారిక ఎంగేజ్‌మెంట్ ఫోటో గ్యాలరీ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెగా ఫ్యామిలీలో ఏమైనా పొరపొచ్చాలు వచ్చాయా ? పవన్ కల్యాణ్ ఎందుకు నిహారిక నిశ్చితార్థానికి హాజరు కాలేదు అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఐతే అందుకు అసలు కారణం మాత్రం వేరే ఉందని తెలుస్తోంది. పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఓ దీక్షలో ఉన్నారని.. ఆ దీక్షలో ఉండటం వల్ల సాయంత్రం 6 గంటల తర్వాత బయటికి వెళ్లకూడదనే ఉద్దేశంతో నిశ్చితార్థం వేడుక కంటే ముందుగానే ఇంటికి వెళ్లి నిహారిక, చైతన్య జొన్నలగడ్డను ( Niharika, Chaitanya Jonnalagadda ) ఆశీర్వదించారని ఫిలింనగర్ టాక్. అందువల్లే ఆయన నిశ్చితార్థంలో పాల్గొనలేకపోయారనేది ఆ టాక్ సారాంశం. Also read : Niharika Engagement: పవన్ కళ్యాణ్ తప్ప అందరూ హాజరు


పవన్ కల్యాణ్ గైర్హాజరు వెనుక కారణాలు ఎలా ఉన్నా.. ఆ అన్నాదమ్ముళ్ల మధ్య బంధం మాత్రం దృఢమైన బంధం ఉందనే విషయంలో మాత్రం ఎటువంటి సందేహం అవసరం లేదని అనేక సందర్భాల్లో రుజువైంది కూడా. అన్నయ్యల పట్ల ఆ తమ్ముడికి ఉండే గౌరవం, అభిమానం... తమ్ముడిపై ఆ అన్నయ్యలకు ఉండే ప్రేమాభిమానాల్లో ఎప్పుడూ, ఏ తేడా కనిపించలేదు. అప్పుడప్పుడు.. సమయం, సందర్భం వచ్చినప్పుడు ఆ విషయం రుజువవుతూనే ఉంది. Also read : పెళ్లికి తొందరేం లేదంటున్న హీరోయిన్