Niharika Engagement: పవన్ కళ్యాణ్ తప్ప అందరూ హాజరు

చిరంజీవి ( chiranjivi ) సోదరుడు నాగబాబు కుమార్తె ( Nagababu daughter ) నీహారిక ఎంగేజ్ మెంట్ అత్యంత ఘనంగా జరిగింది. గంటూరు జిల్లా ఐజీ కుమారుడితో నీహారిక పెళ్లి నిశ్చయమైంది. చిరు కుటుంబంలో పవన్ కళ్యాణ్ తప్ప అందరూ హాజరవడం విశేషం.

Last Updated : Aug 13, 2020, 10:08 PM IST
Niharika Engagement: పవన్ కళ్యాణ్ తప్ప అందరూ హాజరు

చిరంజీవి ( chiranjivi ) సోదరుడు నాగబాబు కుమార్తె ( Nagababu daughter ) నీహారిక ఎంగేజ్ మెంట్ అత్యంత ఘనంగా జరిగింది. గంటూరు జిల్లా ఐజీ కుమారుడితో నీహారిక పెళ్లి నిశ్చయమైంది. చిరు కుటుంబంలో పవన్ కళ్యాణ్ తప్ప అందరూ హాజరవడం విశేషం.

చిరు సోదరుడు నాగబాబు కుమార్తె నీహారిక ( Niharika ) పెళ్లి..గుంటూరు జిల్లాకు చెందిన ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు కుమారుడు వెంకట చైతన్యతో నిశ్చయమైంది. జొన్నలగడ్డ కుటుంబానికి చిరు కుటుంబంతో ఎప్పటినుంచో సాన్నిహత్యముంది. ముఖ్యంగా చిరు తండ్రి, పెళ్లికొడుకు చైతన్య తాతయ్య ప్రాణ స్నేహితులు కావడమే సంబంధం ఖరారవడానికి కారణంగా తెలుస్తోంది. 

అత్యంత ఘనంగా కోవిడ్ నిబంధనల మేరకు జరిగిన పెళ్లి నిశ్చయ వేడుకకు ( Marriage engagement ) మెగా కుటుంబం ( Mega family ) మొత్తం హాజరైంది. చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్, స్నేహరెడ్డి, సాయి ధరమ్ తేజ్ తదితరులంతా నిశ్చితార్ధం వేడుకకు హాజరయ్యారు. కోవిడ్ నిబంధనల ( Covid rules ) మేరకు కుటుంబ సభ్యులు మినహా మిగిలినవారెవ్వరికీ ఆహ్వానం పంపలేదు. 

అందరూ హాజరైనా చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ ( Pawan kalyan ) మాత్రం హాజరు కాలేదు. అందరూ వచ్చి పవన్ కళ్యాణ్ ఒక్కడే రాకపోవడం చర్చనీయాంశమైంది. కొంతమందైతే..వచ్చారు కానీ కెమేరాకు కంటబడలేదంటున్నారు. Also read: Sanjay Dutt: సంజయ్ దత్ గురించి వర్రీ అవుతున్న చిరంజీవి

Trending News