స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) సరసన బ్లాక్ బస్టర్ చిత్రం అల వైకుంఠపురములో నటించిన తరువాత పూజా హెగ్డే తన 9వ చిత్రం ప్రభాస్‌తో కలిసి రాదే శ్యామ్ మూవీలో నటిస్తోంది. అల వైకుంఠపురములో హిట్ అయిన తరువాత, టాలీవుడ్‌లో చాలా మంది దర్శకులు, నిర్మాతలు పూజా హెగ్డే ( Pooja Hegde ) డేట్స్ కోరుకుంటున్నారు. దీంతో సినిమాలకు సైన్ చేసే ముందు ఈ ముద్దు గుమ్మ కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇదే క్రమంలో పూజా హెగ్డె తాజాగా తనకు వచ్చిన ఓ ఆఫర్‌ని తిరస్కరించినట్టు తెలుస్తోంది. Also read: Prabhas Next Movie: ప్రభాస్ మరో ప్యాన్ ఇండియా సినిమా ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాలీవుడ్‌లో ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన అంధా దున్ మూవీ మంచి అక్కడ మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో నటనకుగాను హీరో ఆయుష్మాన్ ఖురానా జాతీయ ఉత్తమనటుడు అవార్డు గెలుచుకున్నాడు. అంధాధున్ మూవీని తెలుగులో రీమేక్ ( Andha dhun telugu remake ) చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్న నితిన్.. ఆ సినిమా రీమేక్ హక్కుల్ని సైతం సొంతం చేసుకున్నాడు. అంధధున్ రీమేక్ హక్కులను నితిన్ సొంత ప్రొడక్షన్ హౌజ్, ష్రేస్ట్ మూవీస్ 3.5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఒరిజినల్ వెర్షన్‌లో బ్లైండ్ పియానిస్ట్ పాత్ర పోషించిన ఆయుష్మాన్ ఖురానా పాత్రలో నితిన్ నటించనున్నాడు. మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో నితిన్ హీరో కాగా అంధాధున్ మూవీలో మరో కీలక పాత్ర పోషించిన టబు స్థానంలో తెలుగు రీమేక్‌లో ఎవరిని తీసుకోవాలనే విషయంలోనే యూనిట్ ఇంకా ఓ కొలిక్కి రాలేకపోతోంది. Also read: Andha Dhun: హిందీ సూపర్ హిట్ “అంధాధున్” తెలుగులో టాబూ పాత్రలో నయన తార?


పూజా హెగ్డేని ఈ పాత్ర కోసం సంప్రదించగా.. ఆమె తిరస్కరించినట్టు వార్తలొస్తున్నాయి. సినిమా నచ్చకనే ఆమె ఈ ఆఫర్‌ని తిరస్కరించినట్టు వార్తలొస్తున్నప్పటికీ.. అసలు విషయం మాత్రం వేరే ఉన్నట్టు ఫిలింనగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అదేమంటే.. ఆమెకు ఆఫర్ చేసిన పారితోషికం నచ్చకనే అంధా ధున్ తెలుగు రీమేక్‌ని రిజెక్ట్ చేసినట్టు టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. Also read: CBI probe: సుశాంత్ మృతి కేసులో మరో కీలక మలుపు


పూజా హెగ్డే చేస్తున్న సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం అఖిల్ అక్కినేని సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీలో నటిస్తోంది. అలాగే సల్మాన్ ఖాన్ సరసన కబీ ఈద్ కబీ దీవాళి అనే హిందీ చిత్రం కూడా పూజా సొంతం చేసుకుంది. Also read: Murder movie ఆపాలంటూ కోర్టులో పిటిషన్