Pushpa 2 The Rule: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు సినీ రంగంపై తీవ్ర ప్రభావం చూపేలా ఉన్నాయి. ఏపీలో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో సినీ కుటుంబాలు కూడా ఉన్నాయి. ముఖ్యమైన నందమూరి, కొణిదెల కుటుంబాలు ఏపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమలో ఆ రెండు కుటుంబాలకు తిరుగులేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ క్రమంలోనే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో అల్లు కుటుంబానికి తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నట్టు కనిపిస్తోంది. అందులో భాగంగానే అల్లు అర్జున్‌ నటించిన పుష్ప 2 సినిమా వాయిదా అని చర్చ జరుగుతోంది. ఆగస్టులో విడుదల కావాల్సిన ఈ సినిమా ఏకంగా నాలుగు నెలల తర్వాతకు వాయిదా పడింది. విడుదలకు సిద్ధమైన సినిమా అనూహ్యంగా సుదీర్ఘ వాయిదా పడడం తెలుగు సినీ పరిశ్రమతోపాటు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Kangana Ranaut: ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ జీతమెంతో తెలుసా? నెలకు ఆమె సంపాదన ఇంత భారీగానా?


ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సుకుమార్‌ దర్శకత్వం వహించిన 'పుష్ప' సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పాన్‌ ఇండియా స్టార్‌గా మారాడు. 2021లో తొలి భాగం సినిమా రాగా.. రెండో భాగం 'పుష్ప 2' ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన విడుదల కావాల్సి ఉంది. రష్మిక మందాన్న జోడీగా మరోసారి బన్నీ వస్తుండడంతో ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే అనూహ్యంగా సోమవారం సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 'మరికొంత చిత్రీకరణ, పోస్టు ప్రొడక్షన్‌ పనుల కారణంగా సినిమా విడుదలను వాయిదా వేస్తున్నాం. డిసెంబర్‌ 6వ తేదీన విడుదల చేస్తాం' అని చిత్రబృందం ప్రకటించింది.

Also Read: Pawan Kalyan: అభిమానులకు పవన్ కళ్యాణ్ బిగ్ షాక్..? ఇకపై వాటికి దూరం..


షూటింగ్‌, పోస్టు ప్రొడక్షన్‌ పనుల పేరిట వాయిదా వేశారు కానీ వాస్తవంగా వేరే కారణాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఏపీ రాజకీయాల నేపథ్యంలోనే సినిమా వాయిదా పడిందని అందరూ చర్చించుకుంటున్నారు. ఎన్నికల సమయంలో అల్లు అర్జున్‌ నంద్యాలకు వెళ్లి తన స్నేహితుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్‌ రెడ్డికి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. తన సొంత మామయ్య పవన్‌ కల్యాణ్‌కు కాకుండా ప్రత్యర్థి పార్టీకి అర్జున్‌ మద్దతు తెలపడం తీవ్ర దుమారం రేపింది.


ఎన్నికల రచ్చ
అయితే తన మామయ్య పవన్‌ కల్యాణ్‌కు చెందిన జనసేన పార్టీ ప్రస్తుతం ఏపీ అధికార కూటమిలో కీలక భాగస్వామిగా ఉంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే అల్లు అర్జున్‌ తీరుపై తీవ్ర విమర్శలు, నిరసనలు వ్యక్తమయ్యాయి. అల్లు అర్జున్‌ను ఉద్దేశించి మెగా కుటుంబం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా పవన్‌ కల్యాణ్‌ ప్రమాణస్వీకారానికి అర్జున్‌తోపాటు ఆయన తండ్రి అల్లు అరవింద్‌, అల్లు కుటుంబసభ్యులు ఎవరూ హాజరుకాలేదు.


కొణిదెల, అల్లు వివాదం
ఇది తెలుగు సినీ పరిశ్రమలో హాట్‌ టాపిక్‌గా మారింది. కొణిదెల, అల్లు కుటుంబాల మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు వచ్చినట్టు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఈ క్రమంలో అధికారంలో కొణిదెల కుటుంబం ఉండడంతో ఈ సమయంలో సినిమాల విడుదల చేస్తే కొన్ని అవాంతరాలు ఎదురవుతాయని చిత్రబృందం గుర్తించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు జనసేన శ్రేణులతోపాటు మెగా ఫ్యాన్స్‌ తీవ్ర ఆవేశంలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో సినిమా విడుదలయితే వివాదం రేగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఎన్నికల్లో బన్నీ చేసిన పనికి 'పుష్ప 2' సినిమాను అడ్డుకునే పరిస్థితులు కూడా లేకపోలేదు. పుష్ప 2 థియేటర్లపై దాడులకు కూడా పాల్పడవచ్చు. 


దాడుల భయం?
వీటన్నిటి నేపథ్యంలో పుష్ప 2 ఐదు నెలలు ముందుకు జరిపినట్లు సినీ రంగంతోపాటు రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. డిసెంబర్‌ వరకైతే కూటమి ప్రభుత్వంలో అల్లు కుటుంబం ఆవేశాలు చల్లారడంతోపాటు పవన్‌ కల్యాణ్‌తో సఖ్యత ఏర్పడే పరిస్థితులు ఉండవచ్చు. డిసెంబర్‌లో విడుదల చేస్తే సినిమాకు ఎలాంటి అవాంతరం ఉండకపోవచ్చనే భావనలో చిత్రబృందం ఉండి ఉండవచ్చు. ఏది ఏమైనా ఏపీ ఎన్నికల ఫలితాలు సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని స్పష్టంగా చెప్పవచ్చు. మరి భవిష్యత్‌లో ఇవి ఎక్కడికి దారి తీస్తాయో వేచి చూడాలి.





స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter