బాలీవుడ్ సీనియర్ స్టార్‌ నటుడు సన్నీ డియోల్‌ కి సుదీర్ఘ కాలం తర్వాత ఒక సక్సెస్ దక్కింది. ఆ సక్సెస్ వల్ల ఆయన కెరీర్‌ పుంజుకోవడంతో పాటు ఆయన మళ్లీ వరుస సినిమాలు చేసే అవకాశాలు దక్కించుకుంటున్నాడు. ఇదే సమయంలో ఆయన పరువు పోయే ప్రమాదం నుండి బయట పడ్డాడు. సినిమా సక్సెస్ అవ్వకుంటే ఆయన ఇన్నాళ్ల సినీ కెరీర్‌ లో సంపాదించుకున్న పరువు మరియు ప్రతిష్ట గంగపాలు అయ్యేది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆయన ఆస్తిని బ్యాంక్ వేలం వేసేందుకు సిద్ధం అయింది. ఆయన బ్యాంక్‌ కు చెల్లించాల్సిన లోను ను రికవరీ చేసుకునేందుకు గాను వేలం ను వేయబోతున్నట్లుగా పేపర్‌ లో ప్రకటన కూడా వచ్చింది. కానీ బ్యాంక్‌ తాజాగా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లుగా తాజాగా కొత్త ప్రకటన చేసింది. సన్నీ డియోల్‌ కి మరింత సమయం ఇచ్చి ఆయన నుండి లోన్‌ రికవరీ చేయాలని నిర్ణయించుకుంది. 


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి సన్నీ డియోల్‌ గత ఏడాది రూ.55.99 కోట్ల లోను తీసుకున్నాడు. ఇప్పటి వరకు దానికి సంబంధించిన వడ్డీ చెల్లించలేదు. అంతే కాకుండా ఆయనకు ఎన్ని నోటీసులు పంపినా కూడా సమాధానం లేదు. దాంతో చేసేది లేక బ్యాంక్‌ వారు సన్నీ డియోల్‌ తనకా పెట్టిన ఆస్తిని వేలం వేసి రికవరీ చేసుకోవాలని భావించారు. ఆ ఆస్తిని వేలం వేసినా కూడా అంత మొత్తం వస్తుందా అనేది అనుమానంగా ఉంది. 


ఆయన సినిమాలు ఈ మధ్య కాలంలో ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. అంతే కాకుండా ఆయన నుండి వస్తున్న స్పందన కూడా లోను చెల్లించే విధంగా లేదని కారణంగా ఆస్తిని వేలం వేయాలని బ్యాంక్ వారు నిర్ణయించుకున్నాఉ అంటూ ఆ మధ్య మీడియాలో రకరకాలుగా పుకార్లు షికార్లు చేశాయి. ఇప్పుడు ఆ వేలం నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లుగా స్వయంగా బ్యాంక్‌ అధికారులు అధికారికంగా ప్రకటించారు. 


Also Read: BRS MLA Candidates List: బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన.. సీఎం కేసీఆర్ సంచలన కామెంట్స్


ఈ వేలం ద్వారా సన్నీ డియోల్‌ తనకా పెట్టిన ఆస్తిని రూ.51.43 కోట్లకు అమ్మేయాలని బ్యాంక్ నిర్ణయించింది. ఇంతలోనే సన్నీ డియోల్‌ నటించిన గదర్ 2 సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ కారణంగా సన్నీ డియోల్‌ క్రేజ్ అమాంతం పెరిగింది. అంతే కాకుండా ఆయనకు ఇకపై వరుసగా సినిమాల్లో నటించే అవకాశాలు వస్తాయి. ఇటీవలే సన్నీ డియోల్‌ సూపర్‌ హిట్ మూవీ సీక్వెల్‌ కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. 


దాంతో బ్యాంకు కు ఆయన చెల్లించాల్సిన మొత్తంను చెల్లించే అవకాశాలు ఉన్నాయి. కనుక ఆస్తిని వేలం వేయాలి అనే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లుగా తెలుస్తోంది. సన్నీ కి చెందిన దాదాపు ఆరు వందల చదరపు మీటర్ల ఆస్తిని బ్యాంక్ వేలం వేసే నిర్ణయాన్ని ప్రస్తుతానికి వెనక్కి తీసుకుంది. ఎంపీ అయిన సన్నీ డియోల్‌ ముందు ముందు అయినా లోను చెల్లిస్తాడనే నమ్మకంతో వేలం ను వాయిదా వేస్తున్నామని బ్యాంక్‌ అధికారులు పేర్కొన్నారు.


Also Read: BRS First List: తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ టీమ్, ఆ 8 మందికి షాక్, మజ్లిస్ స్థానాల్లో అభ్యర్ధుల ప్రకటన 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి