BRS First List: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోరులో బీఆర్ఎస్ అన్ని పార్టీల కంటే ముందుగా అభ్యర్ధుల్ని ప్రకటించేసింది. 119 నియోజకవర్గాలకు 115 నియోజకవర్గాల్లో అభ్యర్ధుల్ని ఎంపిక చేశారు. 8 స్థానాల్లో సిట్టింగులను కాదని కొత్తవారికి అవకాశమిచ్చారు. మరో నాలుగు స్థానాల్ని పెండింగులో ఉంచారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ టీమ్ సిద్ధమైంది. మరో నాలుగు స్థానాల్లో అభ్యర్ధుల ఎంపిక పూర్తయితే బీఆర్ఎస్ ఫుల్ లిస్ట్ వచ్చేసినట్టే. ఈసారి ఎన్నికలకు చాలామంది సిట్టింగులకు అవకాశముండదని భావించినా ఆ సంఖ్యను కేవలం 8కే పరిమితం చేశారు. తద్వారా అసంతృప్తి పెద్దగా లేకుండా చూసుకున్నారు. స్టేషన్ ఘన్‌పూర్, ఉప్పల్, వైరా, వేములవాడ, ఆసిఫాబాద్, ఖానాపూర్, బోధ్, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిట్టింగుల్ని పక్కనబెట్టారు. కామారెడ్డిలో స్వయంగా కేసీఆర్ బరిలో నిలవడంతో అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌కు టికెట్ దక్కలేదు.
ఇక స్టేషన్ ఘన్‌పూర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్థానంలో కడియం శ్రీహరి, ఉప్పల్ సిట్టింగ్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి స్థానంలో బండారు లక్ష్మారెడ్డి, వైరా సిట్టింగు ఎమ్మెల్యే రాములు నాయక్ స్థానంలో మదన్‌లాల్, వేములవాడ సిట్టింగు ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ స్థానంలో లక్ష్మీ నర్శింహరావు,స ఖానాపూర్ సిట్టింగు ఎమ్మెల్యే రేఖా నాయక్ స్థానంలో జాన్సన్ నాయక్, బోధ్ సిట్టింగు ఎమ్మెల్యే రాధోడ్ బాపూరావు స్థానంలో అనిల్ జాదవ్, ఆసిఫాబాద్ సిట్టింగు ఎమ్మెల్యే ఆత్రం సక్కు స్థానంలో కోవా లక్ష్మికి అవకాశం కల్పించారు.
ఈ ఏడుగురిలో వేములవాడ చెన్నమనేని రమేష్‌ను మాత్రం పౌరసత్వం వివాదం కారణంగా పక్కనబెట్టారు. ఇంకా నర్శాపూర్, నాంపల్లి, గోషామహల్, జనగాం అభ్యర్ధుల్ని ప్రకటించాల్సి ఉంది. మజ్లిస్‌కు చెందిన సిట్టింగు స్థానాల్లో సైతం కేసీఆర్ అభ్యర్ధుల్ని ప్రకటించారు. అయినా మజ్లిస్ తనకు మిత్రపక్షమని చెబుతున్నారు. అంటే మజ్లిస్ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్ధుల్ని నామమాత్రానికే ప్రకటించారా అనే వాదన విన్పిస్తోంది.
Also read: BRS MLA Candidates List: బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన.. సీఎం కేసీఆర్ ఇక్కడి నుంచే బరిలోకి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook