Writer Prasanna Praises Ram Charan in Front of Jr NTR @ Dhamki Event: ఆర్ఆర్ఆర్ విషయంలో అభిమానులు ఇప్పటికీ వాగ్వాదం చేస్తూనే ఉన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ పాత్ర బాగుందని మెగా ఫ్యాన్స్, భీమ్ పాత్ర అద్భుతమని నందమూరి ఫ్యాన్స్ వార్‌కు దిగుతూనే ఉన్నారు. తమ హీరోనే బాగా చేశాడని, తమ హీరోదే మెయిన్ పాత్ర అంటూ ఇరువురు హీరోల అభిమానులు కొట్టుకుని చస్తున్నారు. అయితే రామ్ పాత్రలో రాముడిలా కనిపించాడని రామ్ చరణ్‌ లుక్స్‌ను జనాలు అప్పట్లో వైరల్ చేసిన సంగతి తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్లైమాక్స్‌లో అల్లూరి సీతారామరాజులా రామ్ చరణ్ కనిపించిన తీరు, చూపించిన విధానానికి నార్త్ ఆడియెన్స్ ఫిదా అయ్యారని తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ లుక్ గురించి ఎన్టీఆర్ ముందే చెప్పేశాడు రైటర్ ప్రసన్న బెజవాడ. ధమ్కీ సినిమా ఈవెంట్‌లో ఎన్టీఆర్ సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్లో రైటర్ ఇచ్చిన స్పీచ్ అందులో రామ్ చరణ్‌ పాత్ర గురించి చెప్పిన తీరు, ఎన్టీఆర్ ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు వైరల్ అవుతోంది.



ఈ ఈవెంట్‌లో ప్రసన్న మాట్లాడుతూ.. రామ్ చరణ్‌ని అల్లూరి సీతారామరాజుగా చూపించే సమయంలో వెనకాల పెద్ద లైట్ వస్తుంది కదా..? ఆ లైట్ ఇప్పుడు మాకు ఎన్టీఆర్ అంటూ ధమ్కీ ఈవెంట్‌కు వచ్చినందుకు థాంక్స్ అన్నట్టుగా చెప్పాడు. ఇలా రామ్ చరణ్‌ను చూపించిన సీన్‌తో ఎన్టీఆర్‌ను పొగడటంతో సోషల్ మీడియాలో మళ్లీ కొత్త చర్చలు జరుగుతున్నాయి.


ఎన్టీఆర్ సైడ్ కారెక్టర్ అని ఇలా మరీ పబ్లిక్‌గా రామ్ చరణ్ పాత్రను పొగడాలా? అంటూ మెగా ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. అసలే ఎన్టీఆర్‌ది సైడ్ కారెక్టర్ అంటూ గత మూడు నాలుగు రోజులుగా ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. ఎన్టీఆర్ సైడ్ యాక్టర్ అని హాలీవుడ్ రిపోర్టర్ అన్నాడంటూ నిర్మాత చిట్టిబాబు టీవీ డిబెట్లలో పదే పదే ఆ విషయాన్ని ప్రస్థావించిన సంగతి తెలిసిందే.


అసలే ఇప్పుడు రామ్ చరణ్‌, ఎన్టీఆర్ మధ్య గ్యాప్ పెరిగినట్టు టాక్ వినిపిస్తోంది. ఇలాంటి ఫ్యాన్ వార్ వల్ల వారిద్దరి స్నేహం దెబ్బ తింటోన్నట్టుగా కనిపిస్తోంది. అమిత్ షాను కలవడం మీదా ఫ్యాన్స్ చర్చలు పెడుతూ ట్రోలింగ్ చేసుకుంటున్నారు.


Also Read:  Allu Arjun Telugu Pride : బన్నీ పెట్టిన మంట.. ట్విట్టర్‌లో ఫ్యాన్ వార్.. రెచ్చిపోతోన్న మెగా, నందమూరి ఫ్యాన్స్


Also Read: Anasuya Bharadwaj Family : ఫ్యామిలీతో కలిసి చిల్.. వీకెండ్‌లో అనసూయ సందడి.. పిక్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook