Actress Instagram Viral Reels: ఒకప్పుడు సినిమాలో ఆఫర్ కావాలంటే.. ఫోటో షూట్ చేయించుకుని.. ఆ ఫోటోలు పట్టుకొని.. సినిమా స్టూడియోల చుట్టూ.. కాలుకాలిన పిల్లి లాగా తిరగాల్సిన అవసరం ఉండేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని.. అలాంటి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు తమ ఫోటోలతో సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదిస్తే.. చాలు ఆఫర్లు వెతుక్కుంటూ వస్తాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చిన్న హీరోయిన్ల విషయం.. పక్కన పెడితే.. ఒకప్పుడు హీరోయిన్లుగా మంచి పేరు సంపాదించి.. చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న హీరోయిన్ల.. విషయంలో మాత్రం సోషల్ మీడియా చాలా బాగా వర్కౌట్ అవుతోంది. ఉదాహరణకి మీరా జాస్మిన్, అన్షు అంబానీ, హనీ రోజ్ ఇలా చాలామంది నటీమణులు.. హీరోయిన్లుగా తమ సత్తా చాటి గత కొంతకాలంగా.. సినిమాలకి దూరంగా ఉంటూ వస్తున్నారు. 


కానీ సోషల్ మీడియాలో మాత్రం వీరి ఫోటోలు రచ్చ చేస్తున్నాయి. హాట్ హాట్ ఫోటోలతో.. సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.. ఈ హీరోయిన్లు. దీంతో సోషల్ మీడియాలో విపరీతంగా క్రేజ్ సంపాదించిన.. ఈ హీరోయిన్లకు ఆఫర్లు కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. 


ఇలా సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టి.. అందరి దృష్టిని ఆకర్షిస్తూనే మీరా జాస్మిన్.. శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న స్వాగ్ సినిమాలో కీలకపాత్ర పోషించే అవకాశాన్ని అందుకుంది. మరోవైపు మన్మధుడు.. బ్యూటీ అన్షు అంబానీ కూడా సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న మజాకా అనే సినిమాలో నటించాల్సి ఉంది. హనీ రోజ్ కూడా చాలా కాలం తర్వాత.. బాలయ్య వీర సింహా రెడ్డి సినిమాలో కనిపించి అందరిని దృష్టిని ఆకర్షించింది. ఇలా ఒకప్పటి హీరోయిన్లు తమ గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ.. తమని తాము బాగానే ప్రమోట్ చేసుకుంటున్నారు.


కొత్త హీరోయిన్లకి కూడా సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ బాగానే ఉపయోగపడుతున్నాయి. మతిపోయే ఫోటోలు పెట్టి క్రేజ్ సంపాదిస్తున్నారు హీరోయిన్లు. ప్రేక్షకులలో క్రేజ్ ఉంటే నిర్మాతల కన్ను కూడా వారి మీదే ఉంటుంది. అలా పాత హీరోయిన్లు కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో.. సినిమా ఆఫర్లు బాగానే అందుకుంటూ వస్తున్నారు. ప్రేక్షకులు కూడా వారిని వెండి తెర మీద చూడడానికి అంతే ఆసక్తి చూపిస్తున్నారు.


Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..


Read more: Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter