Abadhameva Jayate: `అబద్ధమేవ జయతే`.. టైటిల్ చాలా వెరైటీగా ఉంది: యంగ్ హీరో కార్తీకేయ
Abadhameva Jayate Title Logo: `అబద్ధమేవ జయతే` మూవీ టైటిల్ లోగోను యంగ్ హీరో కార్తీకేయ ఆవిష్కరించారు. టైటిల్ చాలా డిఫరెంట్‌గా ఉందని.. మూవీ టీమ్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఫిబ్రవరిలో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది.
Abadhameva Jayate Title Logo: "అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు.." అని మనం తరచూ వినే సామెత. మరి సామెత నిజమేనా అనే కాన్సెప్ట్‌తో 'అబద్ధమేవ జయతే' అనే టైటిల్‌తో ఓ మూవీ తెరకెక్కనుంది. కామెడీ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో సుశాంత్ యష్కీ, ప్రవణ్యా రెడ్డి, మాస్టర్ వికాస్, మాస్టర్ భాను, విజయ కృష్ణా, వెంకీ లింగం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కె.కార్తికేయన్ సంతోష్ దర్శకత్వం వహిస్తుండగా.. పర్పుల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై కొండా సందీప్, అభిరామ్ అలుగంటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శివుడు, రాకేష్, సృజన గోపాల్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ లోగోను యంగ్ హీరో కార్తీకేయ ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. టైటిల్ చాలా వెరైటీగా ఉందన్నారు. కచ్చితంగా మూవీ ఆడియన్స్‌ను మెప్పిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. చిత్రబృందానికి ఆల్ ద బెస్ట్ చెప్పి.. మంచి సక్సెస్ సాధించాలని ఆకాంక్షించారు. విలేజ్ డ్రామాగా 'అబద్ధమేవ జయతే' చిత్రాన్ని రూపొందిస్తున్నామని.. 20 ఏళ్ల క్రితం ఉన్న సెట్ ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతుందని మేకర్స్ తెలిపారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
సూరారం, వేములవాడ, వికారాబాద్, రాజమండ్రి, కాకినాడ ప్రాంతాల్లోని గ్రామీణ వాతావరణంలోనే చిత్రీకరించారు. ఈ చిత్రానికి పవన్ సంగీత అందించగా.. వికాస్ చిక్‌బల్లాపూర్ కెమెరామెన్‌గా పనిచేస్తున్నారు. ఎడిటింగ్ బాధ్యతలు షాడో నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
టెక్నీకల్ టీమ్
==> బ్యానర్: పర్పుల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ
==> ప్రొడ్యూసర్స్: కొండా సందీప్, అభిరామ్ అలుగంటి
==> సహ నిర్మాతలు: బాల శివుడు, రాకేష్, సృజన గోపాల్
==> డైరెక్టర్: కె.కార్తికేయన్ సంతోష్
==> మ్యూజిక్: పవన్
==> కెమెరామెన్ :వికాస్ చిక్‌బల్లాపూర్
==> ఎడిటర్ :షాడో
==> PRO: సాయి సతీష్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter