Love You Ram Movie Review: లవ్ యు రామ్ మూవీ రివ్యూ.. డైరెక్టర్ దశరథ్ ఎలా తీశాడంటే..?
Love You Ram Movie Review and Rating: డైరెక్టర్ దశరథ్ నిర్మాతగా.. నటుడిగా లవ్ యు రామ్‌తో తొలిసారి సరికొత్త ప్రయత్నం చేశాడు. ఈ సినిమా శుక్రవారం బాక్సాఫీసు ముందు సందడి మొదలు పెట్టింది. యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ ఎలా ఉందంటే..?
Love You Ram Movie Review and Rating: మన ఎంటర్‌టైన్‌మెంట్, శ్రీ చక్ర ఫిల్మ్స్‌పై దశరథ్ దర్శకత్వంలో రూపొందించిన మూవీ లవ్ యు రామ్. రోహిత్ బెహల్, అపర్ణ జనార్ధనన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను డీవై చౌదరి, దశరథ్ నిర్మించారు. వేద మ్యూజిక్ అందించగా.. సినిమాటోగ్రాఫర్ సాయి సంతోష్ వ్యవహరించారు. జూన్ 30న ఆడియన్స్ ముందుకు వచ్చిన లవ్ యు రామ్ సినిమా ఎలా ఉందో చుద్దాం..
స్టోరీ ఏంటి..?
హీరో రామ్ (రోహిత్ బెహల్) నార్వే దేశం శ్రీనివాస హోటల్స్ పేరుతో వ్యాపారం నిర్వహిస్తుంటాడు. తన లైఫ్‌లో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న రామ్.. పూర్తిగా కమర్షియల్‌గా మారిపోయింటాడు. దీంతో నార్వేలో ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు.. తన వద్ద జీతం తీసుకోకుండా పని చేసే వైఫ్ కమ్ ఎంప్లాయ్‌ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. తాను పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిని చూడాలని తన వ్యాపారాలకు సీఈఓగా ఉన్న పీసీ (దశరథ్)కు చెబుతాడు. ఐదుగురి అమ్మాయిలను ఎంపిక చేసుకోగా.. వీరిలో రామ్ చిన్ననాటి ఫ్రెండ్ దివ్య (అపర్ణ జనార్దనన్) కూడకా ఉంటుంది. దివ్య తన చిన్ననాటి స్నేహితురాలు అని తెలియక రామ్ ఆమెను తన బిజినెస్ పరంగా ఉపయోగించుకోవాలని అనుకుంటాడు. అయితే చిన్నతనంలో రామ్ చెప్పిన మాటలకు ఇన్‌స్పైర్ అయి నలుగురు సాయం చేసే గుణం అలవాటు చేసుకున్న దివ్య.. పెళ్లికి మరో గంటలో ఉందనగా రామ్ అసలు స్వరూపం బట్టబయలు అవుతుంది. దివ్య ఎలా రియాక్ట్ అయింది..? రామ్‌ను వివాహం చేసుకుందా..? దివ్యను తన చిన్ననాటి ఫ్రెండ్ అని తెలుసుకున్న రామ్ ఎలా రియాక్డ్ అయ్యాడు..? దివ్య, రామ్ ఒక్కటయ్యారా..? అనేది తెలియాలంటే లవ్ యు రామ్ సినిమాను వీక్షించాల్సిందే..
సినిమా ఎలా ఉందంటే..?
ఈ జనరేషన్‌ను దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్ దశరథ్ మూవీని తెరకెక్కించారు. చాలా మంది జీవితాల్లో జరిగే కామన్ పాయింట్‌నే తీసుకుని.. సరికొత్తగా మలిచాడు. ప్రస్తుతం లవ్ అంటే ఫేస్‌బుక్‌లో చూసుకోవడం.. వాట్సాప్‌లో చాట్ చేసుకోవడం.. తరువాత కలుసుకోవడం.. కొద్దిరోజులకే బ్రేకప్ చెప్పేసుకోవడం కామన్‌గా మారింది. లవ్ యు రామ్ సినిమా కథ కాస్త కొత్తగా అనిపించినా.. తెరపై చూపించడంలో దర్శకుడు తడబడినట్లు అనిపిస్తుంది. మూవీ స్టార్టింగ్‌లోనే హీరో క్యారెక్టర్ రివీల్ అయిపోతుంది. తన పెళ్లి కోసం ఆన్‌లైన్‌లో అమ్మాయిని వెతకడం.. ఆమె కోసం ఇండియాకు వచ్చి ప్రేమించినట్లు నటించడం.. రెండు కుటుంబాల మధ్య సరదా సన్నివేశాలతో ప్రథమార్థం ముగుస్తుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ సెకాండఫ్‌పై ఆసక్తిని రేకెత్తిస్తుంది.
అయితే సెకాండాఫ్ కాస్త రొటీన్‌గా సాగడంతో ఆడియన్స్ నిరాశకు గురవుతారు. అన్ని సినిమాల్లో చూసినట్లే హీరోయిన్‌ను ఇంప్రెస్ చేసేందుకు హీరో ట్రై చేస్తాడు. ఈలోపు హీరో నిజ స్వరూపం హీరోయిన్‌కు తెలిసిపోవడం.. ఆమె ఫీలవ్వడం.. తరువాత హీరోకు మరో ఛాన్స్ ఇవ్వడం ఇలా ప్రేక్షకుడికి ఊహందేలా సీన్లు ఉన్నాయి. క్లైమాక్స్‌పై దర్శకుడు మరింత దృష్టిపెట్టాల్సింది. పీసీ పాత్రలో దశరథ్ చేసే కామెడీ ఆకట్టుకుంటుంది. డబ్బుల కోసం అమ్మాయి తండ్రి (బెనర్జీ) బురిటీ కొట్టించే సీన్లు ప్రేక్షకులకు నచ్చుతాయి.
పూర్తిగా కమర్షియల్‌గా మారిపోయిన వ్యక్తిగా రామ్ క్యారెక్టర్‌లో రోహిత్ బెహల్ చక్కగా నటించాడు. పల్లెటూరి అమ్మాయిగా హీరోయిన్ అపర్ణ జనార్ధనన్ మెప్పిస్తుంది. పీసీ క్యారెక్టర్‌లో దశరథ్ తొలిసారి ఆన్ స్క్రీన్‌పై చక్కగా కామెడీ పండించాడు. ఇంట్లోనే ఖాళీగా ఉంటూ జూదానికి అలవాటు పడిన వ్యక్తిగా బెనర్జీ యాక్టింగ్ నచ్చుతుంది. మిగిలిన పాత్రల్లో ఇతర నటులు తమ పరిధి మేర నటించారు. వేద నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. పాటలు పర్వాలేదనిపించినా.. సాయి సంతోష్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా.. ఈ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ఆడియన్స్‌కు నచ్చుతుంది.
Also Read: Narayana & Co Review: కామెడీ ఎంటర్‌టైనర్ నారాయణ & కో మూవీ రివ్యూ.. ప్రేక్షకులను మెప్పించిందా..?
Also Read: Small Saving Schemes: పోస్టాఫీసు పథకాలపై వడ్దీ రేట్లు పెంపు.. కొత్త రేట్లు ఇలా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook