Small Saving Schemes: పోస్టాఫీసు పథకాలపై వడ్దీ రేట్లు పెంపు.. కొత్త రేట్లు ఇలా..!

Small Savings Interest Rates Hike: పోస్టాఫీసు పథకాలపై వడ్డీ రేట్లను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండో త్రైమాసికానికి కొత్త వడ్డీ రేట్లు వర్తించనున్నాయి. ఏయే పథకాలపై ఎంత వడ్డీ పెరిగింది..? వివరాలు ఇలా..  

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 1, 2023, 07:13 AM IST
Small Saving Schemes: పోస్టాఫీసు పథకాలపై వడ్దీ రేట్లు పెంపు.. కొత్త రేట్లు ఇలా..!

Small Savings Interest Rates Hike: సేవింగ్స్ స్కీమ్స్‌లో చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెడుతున్న వారికి కేంద్రం శుభవార్త అందించింది. రెండో త్రైమాసికానికి కొన్ని స్మాల్ సేవింగ్ స్కీమ్స్ వడ్డీ రేటును 0.30 శాతం పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వడ్డీ రేట్లను సవరిస్తూ.. నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని చిన్న మొత్తాల పొదుపు పథకాలకు వడ్డీ రేట్లను పెంచాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా నోటిఫికేషన్‌లో వెల్లడించింది.

ఆర్‌డీపై 0.3 శాతం శాతం వడ్డీ రేటును ఆర్థిక శాఖ పెంచింది. ఇప్పటివరకు 6.2 శాతంగా ఉన్న ఫ్రీక్వెన్సీ డిపాజిట్ హోల్డర్లు.. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 6.5 శాతం వడ్డీని అందుకోనున్నారు. ఎక్కువమంది పెట్టుబడి పెడుతున్న పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌) స్కీమ్ వడ్డీ విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదు. 7.1 శాతం వద్దనే ఉంచింది. అదేవిధంగా సేవింగ్స్ అకౌంట్‌లోని డిపాజిట్లపై వడ్డీ 4 శాతంగానే ఉంది. నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్‌పై వడ్డీ కూడా 7.7 శాతంగానే ఉంచింది.

పోస్టాఫీసులలో ఒక ఏడాది ఎఫ్‌డీపై వడ్డీ 0.1 శాతం నుంచి 6.9 శాతానికి పెరుగుతుంది. రెండేళ్ల ఎఫ్‌డీపై వడ్డీ ఇప్పుడు 6.9 శాతంగా ఉన్న 7.0 శాతంగా ఉంటుంది. మూడేళ్లు, ఐదేళ్ల కాల వ్యవధి డిపాజిట్లపై 7.0, 7.5 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. సుకన్య సమృద్ధి యోజనపై వడ్డీ రేటు కూడా 8.0 శాతమే ఉండగా.. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, కిసాన్ వికాస్ పత్రపై వడ్డీ వరుసగా 8.2 శాతం, 7.5 శాతం వడ్డీ లభించనుంది. 

స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లు ప్రభుత్వ సెక్యూరిటీల రాబడిపై ఆధారపడి నిర్ణయిస్టారు. ఎస్.గోపీనాథ్ కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం 2016 నుంచి వడ్డీ రేట్లను ఇలానే నిర్ణయిస్తోంది. ప్రభుత్వ సెక్యూరిటీల రాబడి ఆధారంగానే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, పీపీఎఫ్‌, కిసాన్ వికాస్ పత్ర, సుకన్య సమృద్ధి ఖాతా  తదితర చిన్న పొదుపు పథకాలకు కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను అందిస్తోంది.

Also Read: GST Rates 2023: గుడ్‌న్యూస్.. భారీగా జీఎస్టీ తగ్గింపు.. తక్కువ ధరకే మొబైల్స్, టీవీలు ఇంకా..  

Also Read: Revanth Reddy: కాంగ్రెస్‌లో పొంగులేటి చేరికకు అసలు కారణం బయటపెట్టిన రేవంత్ రెడ్డి.. అందుకే ఆ నిర్ణయం..!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News