Prasad Behara Arrest: వెబ్‌ సిరీస్‌లలో అవకాశం ఇస్తానని చెప్పి తన స్నేహితురాలిని పిలిచి అనంతరం అసభ్యంగా వేధించడం.. అనంతరం లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ప్రముఖ యూట్యూబర్‌ అరెస్టయ్యాడు. ఓ యువతిని వేధించిన కేసులో యూట్యూబ్‌ స్టార్‌ ప్రసాద్‌ బెహారాను హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌ చేశారు. ఈ వార్త సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Spy Camera: మహిళా టీచర్ల బాత్రూమ్‌లో రహాస్య కెమెరా.. స్కూల్‌ డైరెక్టర్‌ నీచపు పని


హైదరాబాద్‌లో నివసిస్తున్న ప్రసాద్‌ బెహారాకు 11 సంవత్సరాల నుంచి ఓ యువతి పరిచయం ఉంది. పెళ్లివారమండి సిరీస్ షూటింగ్ చేస్తున్నప్పుడు ప్రసాద్‌ ఆమెను అనుచితంగా తాకాడు. ఇబ్బందికర పరిస్థితులు ఎదురవడంతో ఆమె వెబ్ సిరీస్ నుంచి వైదొలిగింది. ఆమె నిర్ణయంతో షాక్‌కు గురయిన ప్రసాద్‌ వెంటనే ఆమెకు చాలాసార్లు క్షమాపణలు చెప్పి.. బతిమిలాడాడు. అనంతరం సంవత్సరం తర్వాత ఆమెతో కలిసి ప్రసాద్‌ "మెకానిక్" అనే వెబ్ సిరీస్ చేశాడు.

Aslo Read: Insta Reel: వ్యూస్‌ కోసం రోడ్డుపై రూ.25 వేలు.. 'మనీ హంటింగ్‌‌' ఆట కట్టించిన పోలీసులు


ఇక్కడ కూడా ప్రసాద్‌ వేధింపులకు గురి చేశాడని బాధితురాలు వాపోయింది. అసభ్యకరంగా తాకడం.. షూట్ లొకేషన్‌లో ఇబ్బందికరంగా ప్రవర్తించడంతో యువతి తీవ్ర ఇబ్బందులకు గురయ్యింది. అంతేకాకుండా అతడు అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ వేధించసాగాడు. అతడి అసభ్య ప్రవర్తన తీవ్రమవడమే కాకుండా ఈనెల 11వ తేదీన షూటింగ్‌ సమయంలో ప్రసాద్‌ దాడికి పాల్పడ్డాడు. 'నువ్వు నన్ను ఎందుకు కొట్టావు' అని అడిగితే సరైన సమాధానం చెప్పలేదని ఫిర్యాదులో వాపోయింది.


వీటన్నిటిని తట్టుకుని ఆ వెబ్‌సిరీస్‌ షూటింగ్‌ పూర్తి చేస్తున్నా కూడా ప్రసాద్‌ మరింత రెచ్చిపోయాడు. షూట్‌లో అతడు రాయలేని రీతిలో ఆమెను కామెంట్లు చేయడం ప్రారంభించాడు. 'నీవు హాట్‌గా ఉంటావు. నాకు క్యూట్‌గా ఉంటేనే ఇష్టం' వంటి వ్యాఖ్యలు చేశాడు. అంతేకాకుండా ముఖానికి లేజర్ ట్రీట్‌మెంట్ చేసుకోవాలని అవమానించడంతో ప్రసాద్‌ వేధింపులు భరించలేక ఆమె జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రసాద్‌ బెహారాను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చారు. యూట్యూబ్ స్టార్ ప్రసాద్ బెహరాను జూబ్లీహిల్స్ పోలీసులు 14 రోజుల రిమాండ్‌కి పంపించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.