Chemical Explosion: హైదరాబాద్‌లో డంప్ యార్డులో పేలిన కెమికల్ బాటిల్.. ఇద్దరికి గాయాలు
Chemical Explosion in Hyderabad: హైదరాబాద్ డంపింగ్ యార్డులో పేలుడు ఘటనలో గాయపడిన వారిని ఇద్దరినీ ఒకే కుటుంబానికి చెందిన తండ్రీ కొడుకులుగా గుర్తించారు. ఆ ఇద్దరినీ హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ ఇద్దరి పరిస్థితి నిలకడగానే ఉందని హైదరాబాద్ పోలీసులు తెలిపారు.
Chemical Explosion in Hyderabad: హైదరాబాద్‌లో డంప్ యార్డులో పడేసిన థిన్నర్ బాటిల్ పేలిన ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. డంపింగ్ యార్డులో పేలుడు ఘటన తొలుత నగరంలో కలకలం సృష్టించింది. ఈ పేలుడు వెనుక అసాంఘిక శక్తుల ప్రమేయం ఏమైనా ఉందా అనే సందేహాలతో పోలీసులు క్లూస్ టీమ్‌ని రప్పించారు.
ఘటనా స్థలాన్ని క్షణ్ణంగా పరిశీలించిన క్లూస్ టీమ్.. అక్కడి పరిసరాలను తనిఖీ చేసిన అనంతరం ఒక నిర్ధారణకు వచ్చింది. థిన్నర్ బాటిల్ మూత బిగించి ఉండటంతో... అందులో జరిగిన రసాయనిక చర్యే బాటిల్ పేలడానికి కారణమై ఉంటుందని ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు.
హైదరాబాద్ డంపింగ్ యార్డులో పేలుడు ఘటనలో గాయపడిన వారిని ఇద్దరినీ ఒకే కుటుంబానికి చెందిన తండ్రీ కొడుకులుగా గుర్తించారు. ఆ ఇద్దరినీ హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ ఇద్దరి పరిస్థితి నిలకడగానే ఉందని హైదరాబాద్ పోలీసులు తెలిపారు.