7th Pay Commission DA Hike DA Arrears and PF interest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెప్టెంబర్ నెల పండగే అని చెప్పొచ్చు. ఒకే నెలలో ఉద్యోగులకు కేంద్రం మూడు కానుకలు అందించే అవకాశం ఉంది. డీఏ పెంపు, డీఏ బకాయిల చెల్లింపుతో పాటు పీఎఫ్ వడ్డీని  ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది. సెప్టెంబర్ మొదటి వారంలో డీఏ పెంపుపై  ప్రకటన ఆ తర్వాత డీఏ బకాయిల చెల్లింపు, పీఎఫ్ వడ్డీ జమ ఉంటుందని ఉద్యోగులు అంచనా వేస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డీఏ పెంపు ఎంత ఉండొచ్చు :


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం 34 శాతం డీఏ అందుతోంది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏటా రెండు డీఏలు ఉంటాయి. ఈ ఏడాది మార్చిలో కేంద్రం మొదటి డీఏను ప్రకటించింది. జనవరి నుంచే ఇది అమలులోకి వచ్చింది. ఇక రెండో డీఏ ఎప్పుడనేది కేంద్రం ఇప్పటికైతే ప్రకటించలేదు. ఆగస్టు నెల కూడా ముగుస్తుండటంతో సెప్టెంబర్‌ మొదటివారంలో రెండో డీఏ పెంపు ఉండొచ్చునని ఉద్యోగులు భావిస్తున్నారు. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైజ్ ఇండెక్స్ (ఏఐసీపీఐ) జూన్‌ నెలలో 129.2 పాయింట్లుగా ఉంది. ఈ లెక్కన 4 శాతం డీఏ పెంపుకు 7వ వేతన సంఘం సిఫారసు చేసే అవకాశం ఉంది.


డీఏ బకాయిలు కూడా సెప్టెంబర్‌లోనే :


కరోనా కాలంలో 18 నెలల పెండింగ్ డీఏ బకాయిలను కేంద్రం ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా మే 2020 నుంచి జూన్, 2021 వరకు కేంద్రం డీఏని నిలిపివేసింది. సెప్టెంబర్‌లోనే ఈ ఏరియర్స్ ఉద్యోగుల ఖాతాలో జమయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే ఉద్యోగులకు ఒకేసారి భారీ మొత్తంలో డబ్బు అందుతుంది.


పీఎఫ్ వడ్డీ కూడా :


ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్‌పై 2021-22 వడ్డీ రేటును సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 8.10గా నిర్ణయించింది. ఈ మేరకు సెప్టెంబర్‌లో ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ కానుంది. ఒకే నెలలో డీఏ పెరగనుండటం, డీఏ బకాయిలు, పీఎఫ్ వడ్డీ కూడా జమయ్యే అవకాశం ఉండటంతో ఉద్యోగులకు సెప్టెంబర్ నెల పండగే అని చెప్పొచ్చు. 


Also Read: DA Hike Updates: డీఏ పెంపుపై కీలక అప్‌డేట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనం ఎంత పెరగనుందంటే..


Also Read: Munugode Bypoll: మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు? బహిరంగ సభలో కేసీఆర్ ట్విస్ట్ ఇవ్వబోతున్నారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook