DA Hike Updates: డీఏ పెంపుపై కీలక అప్‌డేట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనం ఎంత పెరగనుందంటే..

DA Hike Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈసారి డీఏ ఎంత పెరగవచ్చు.. ప్రస్తుత ద్రవ్యోల్బణాన్ని బట్టి డీఏ పెంపు అంచనాలు ఎలా ఉన్నాయి..

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 16, 2022, 11:24 AM IST
  • కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్
  • డీఏ పెంపుపై కీలక అప్‌డేట్
  • డీఏ ఎంత పెరగవచ్చంటే..
DA Hike Updates: డీఏ పెంపుపై కీలక అప్‌డేట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనం ఎంత పెరగనుందంటే..

DA Hike Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఏడాది రెండో డీఏ పెంపు త్వరలోనే ఉండే అవకాశం ఉంది. కొద్ది నెలలుగా ఉద్యోగులు డీఏ పెంపు కోసం ఎదురుచూస్తున్నారు. ద్రవ్యోల్బణం, ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైజ్ ఇండెక్స్ (ఏఐసీపీఐ) ఆధారంగా కేంద్ర ప్రభుత్వం డీఏ పెంపుపై నిర్ణయం తీసుకుంటుంది. జూలై నెలను పరిగణలోకి తీసుకుంటే రిటైల్ ద్రవ్యోల్బణం 6.71 శాతంగా ఉంది. జూన్‌తో పోలిస్తే స్వల్ప మేర తగ్గింది. ఏఐసీపీఐ ఇండెక్స్ జూన్‌లో 129.2 పాయింట్లుగా ఉంది. మే నెలతో పోలిస్తే 0.2 పాయింట్లు పెరిగింది. ఈ నేపథ్యంలో డీఏ పెంపు ఎంత ఉండొచ్చు.. డీఏ పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనం ఎంత పెరుగుతుందనేది ఇప్పుడు చూద్దాం...

డీఏ పెంపు 4 శాతం ఉండే ఛాన్స్ :

సాధారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతీ ఏటా రెండుసార్లు డీఏ పెంపు ఉంటుంది. ఈ ఏడాది మొదటి డీఏ పెంపు జనవరి నుంచే అమలులోకి వచ్చింది. కేంద్రం 3 శాతం డీఏ పెంచడంతో ప్రస్తుతం ఉద్యోగులకు 34 శాతం డీఏ అందుతోంది. ఇక రెండో డీఏ ఎప్పుడనే దానిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. జూలై నెలలో 6.71 శాతం ద్రవ్యోల్బణం నమోదు కావడంతో డీఏ పెంపు 4 శాతం మేర ఉండొచ్చుననే అంచనాలు వెలువడుతున్నాయి.

డీఏ పెంపు 4 శాతం ఉంటే జీతం ఎంత పెరిగే ఛాన్స్ :

గరిష్ట వేతనం పొందే ఉద్యోగులకు డీఏ పెంపు ఇలా

1. ఉద్యోగి గరిష్ఠ బేసిక్ పే రూ.56,900 
2. 4 శాతం పెంపుతో 38 శాతానికి డీఏ పెరిగితే.. ప్రతీ నెలా రూ. 21,622 డీఏ అందుతుంది.
3. ప్రస్తుత డీఏ (34 శాతం) ప్రతీ నెలా రూ.19,346
4. డీఏ 4 శాతం పెరిగితే నెలకు ఎంత పెరిగినట్లు... రూ.21,622-రూ.19,346 = రూ.2260
5. ఏడాదికి 2260 X12 = రూ 27,120 పెంపు.. 
6. ఇప్పుడు అందుతున్న వేతనానికి ప్రతీ నెలా పెరిగిన డీఏ కూడా చేరుతుంది.

కనీస వేతనం పొందే ఉద్యోగులకు డీఏ పెంపు ఇలా
 

1. ఉద్యోగి బేసిక్ రూ.18,000
2. డీఏ పెంపు (38 శాతం)తో ప్రతీ నెలా రూ.6840
3. ప్రస్తుతం ప్రతీ నెలా అందుతున్న డీఏ (34 శాతం ) రూ.6120
4. డీఏ నెలకు ఎంత పెరుగుతుంది.. రూ.6840-రూ.6120 = రూ.1080
5. ఏడాదికి 720X12 = రూ.8640 పెంపు
6. ప్రస్తుతం అందుతున్న వేతనానికి డీఏ పెంపు కూడా చేరుతుంది.

Also Read: India COVID 19 Update: భారీగా తగ్గిన కరోనా కేసులు.. దేశంలో కొత్తగా ఎన్నొచ్చాయంటే?

Also Read: Janmashtami 2022: కృష్ణ జన్మాష్టమి ముహూర్తం ఎప్పుడో తెలుసా..? శుభ ముహూర్తం, ఇతర వివరాలు తెలుసుకోండి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News