7th Pay Commission: డీఏ పెంపు తేదీ ఖరారు, సెప్టెంబర్ 28న మూడు నెలల ఎరియర్స్‌తో భారీగా జీతం
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు ఎప్పుడనేది నిర్ధారణైపోయింది. మరో ఏడు రోజుల తరువాత పెరిగిన జీతం, డీఏ అందనున్నాయి.
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు ఎప్పుడనేది నిర్ధారణైపోయింది. మరో ఏడు రోజుల తరువాత పెరిగిన జీతం, డీఏ అందనున్నాయి.
ఈసారి దీపావళికి ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బహుమానం అందనుంది. ఉద్యోగుల జీతం భారీగా పెరగనుంది. సెప్టెంబర్ నెలాఖరుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెరిగిన డీఏ లభించనుంది. దాంతోపాటు 2 నెలల డీఏ కూడా జమ కానుంది. అయితే ఎప్పుడు ఏ రోజు పెరిగిన జీతం, డీఏ ఎక్కౌంట్‌లో పడనున్నాయో తెలుసుకుందాం..
సెప్టెంబర్ 28న ప్రకటన
మరి కొద్దిరోజుల్లో నిరీక్షణకు తెరపడనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో పెద్దమొత్తంలో డబ్బులు జమ కానున్నాయి. సెప్టెంబర్ 28వ తేదీన అధికారిక ప్రకటనతో పెరిగిన జీతం రానుంది. అంటే నవరాత్రికి బహుమానం అందనుంది. 38 శాతం డీఏ చొప్పున రానుంది.
జూలై నుంచి పెరిగిన డీఏ వర్తింపు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కొత్త కరవు భత్యం జూలై 1, 2022 నుంచి అమల్లో రానుంది. అంటే మూడు నెలల ఎరియర్స్ ఒకేసారి అందనున్నాయి. ఏఐసీపీఐ సూచిక ప్రకారం డీఏ 38 శాతంగా నిర్ధారణైంది.
కొంతమందికి కనీస వేతనం 18 వేలు కాగా, మరి కొంతమందికి 56,900 ఉంది. ఇందులో 38 శాతం డీఏ వర్తిస్తుంది. కనీస వేతనంపై డీఏ పెంపు 6840 రూపాయలౌతుంది. అంటే నెలకు 720 రూపాయలు. అదే కనీస వేతనం 56,900 ఉన్నవారికి 27,312 రూపాయలు పెరగనుంది.
Also read: Aadhaar Card Download: రిజిస్టర్ మొబైల్ నెంబర్ లేకుండా ఆధార్ కార్డు డౌన్‌లోడ్ ఎలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook