Aadhaar Card Download: రిజిస్టర్ మొబైల్ నెంబర్ లేకుండా ఆధార్ కార్డు డౌన్‌లోడ్ ఎలా

Aadhaar Card Download: ఆధార్ కార్డు విషయంలో కీలకమైన అప్‌డేట్ ఇది. ఇక నుంచి రిజిస్టర్ మొబైల్ నెంబర్ లేకుండానే యూఐడీఏఐ వెబ్‌సైట్ నుంచి ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు ఎలాగంటే..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 21, 2022, 08:43 AM IST
Aadhaar Card Download: రిజిస్టర్ మొబైల్ నెంబర్ లేకుండా ఆధార్ కార్డు డౌన్‌లోడ్ ఎలా

Aadhaar Card Download: ఆధార్ కార్డు విషయంలో కీలకమైన అప్‌డేట్ ఇది. ఇక నుంచి రిజిస్టర్ మొబైల్ నెంబర్ లేకుండానే యూఐడీఏఐ వెబ్‌సైట్ నుంచి ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు ఎలాగంటే..

ఆధార్ కార్డు యూజర్లకు కావల్సిన సమాచారమిది. ఇక నుంచి రిజిస్టర్ మొబైల్ నెంబర్ లేకుండానే ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గతంలో అయితే ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేయాలంటే ఆధార్‌తో అనుసంధానమైన రిజిస్టర్ మొబైల్ నెంబర్ తప్పకుండా అవసరమయ్యేది. ఇప్పుడు ఆ అవసరంలేదు. 

ఆధార్ కార్డు జారీ చేసే యూఐడీఏఐ ఈ ప్రకటన చేసింది. ఇక నుంచి రిజిస్టర్ మొబైల్ నెంబర్ లేకుండానే ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చని. మెబైల్ నెంబర్ లేకుండా ఆధార్ కార్డు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చో తెలుసుకుందాం..

ముందుగా యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి..మై ఆధార్ ట్యాప్ చేయాలి. తరువాత ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ స్థానంలో 16 అంకెల వర్చువల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ కూడా ఎంటర్ చేయవచ్చు. ఆ తరువాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. రిజిస్టర్ మొబైల్ నెంబర్ లేకుండా కార్డు డౌన్‌లోడ్ చేయాలంటే..నా మొబైల్ నెంబర్ ధృవీకరణ కాలేదు అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఇప్పుడు సెండ్ ఓటీపీ క్లిక్ చేస్తే మీరిచ్చిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ ప్రెస్ చేస్తే కొత్త పేజ్‌కు రీడైరెక్ట్ అవుతారు. 

రీప్రింటింగ్ వెరిఫికేషన్ కోసం ఇక్కడ ఆధార్ కార్డు ప్రింట్ ప్రివ్యూ కన్పిస్తుంది. చివరిగా మేక్ పేమెంట్ ఆప్షన్ ఎంచుకోవాలి.

Also read: TRF Share: వారం రోజుల్లో 101 శాతం పెరిగిన షేర్ ధర, ఇన్వెస్టర్లకు లాభాల పంట

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News