అమీర్ ఖాన్ ఆ పాత్ర ఎందుకు చేయలేదంటే?
సంజయ్ దత్ జీవితకథను `సంజు` అనే పేరుతో రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
సంజయ్ దత్ జీవితకథను "సంజు" అనే పేరుతో రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే సినిమాలో అలనాటి హీరో మరియు సంజయ్ దత్ తండ్రి సునీల్‌దత్ పాత్రకు తొలుత అమీర్ ఖాన్‌ను అనుకున్నారట దర్శకులు. కానీ ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారట అమీర్. అయితే అందుకు కారణం వేరే ఉందట. నిజం చెప్పాలంటే, "సంజు" స్క్రిప్ట్ విన్నాక, అందులో సంజయ్ దత్ పాత్రపై ఎంతో ప్రేమను పెంచుకున్నారట అమీర్.
అలాంటి పాత్రలో తాను నటిస్తే ఎంతో బాగుణ్ణు అని కూడా అనుకున్నారట. కానీ ఆ పాత్ర రణబీర్ కపూర్‌కి వెళ్లడంతో కాస్త నొచ్చుకున్నారట కూడా. కానీ రణ్‌బీర్ కపూర్‌ని ఆ పాత్రలో చూశాక.. చాలా బాగా చేశాడని కూడా మెచ్చుకున్నాడు అమీర్ ఖాన్. కానీ.. ఆ పాత్ర తాను చేయలేదనే ఫీలింగ్ కలుగుతుంది కాబట్టే తాను ఆ చిత్రంలో వేషం వచ్చినా వదులుకున్నానని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు అమీర్ ఖాన్.
అమీర్ ఖాన్ గతంలో రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో పీకే, 3 ఇడియట్స్ లాంటి చిత్రాలలో హీరోగా నటించారు. ప్రస్తుతం విజయ్ క్రిష్ణ ఆచార్య దర్శకత్వంలో "థగ్స్ ఆఫ్ హిందుస్తాన్" అనే ఓ చిత్రంలో నటిస్తున్నారు. సంజు చిత్రంలో అమీర్ ఖాన్ పోషించాల్సిన సునీల్ దత్ పాత్రను నటుడు పరేష్ రావెల్ పోషిస్తున్నారు.