బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ (Arjun Kapoor) తన అభిమానులకు శుభవార్త చెప్పాడు. తాను కరోనా వైరస్ (CoronaVirus) బారి నుంచి కోలుకున్నానని (Arjun Kapoor tests Negative for CoronaVirus) వెల్లడించాడు. తాజాగా జరిపిన కోవిడ్19 నిర్ధారణ టెస్టులలో తనకు నెగిటివ్‌గా తేలినట్లు తెలిపాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో హీరో అర్జున్ కపూర్ ఓ పోస్ట్ చేశాడు. సరిగ్గా నెల రోజుల కిందట అర్జున్ కపూర్ తనకు కరోనా సోకిందని తెలిపాడు. నెల రోజుల చికిత్స తర్వాత కరోనా నుంచి కోలుకున్నాడు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా నుంచి కోలుకున్నానని చెబుతూనే వైరస్‌ను మీరు తేలికగా తీసుకోవచ్చు.. కానీ కరోనా వైరస్ మిమ్మల్ని అంత ఈజీగా తీసుకోదంటూ హెచ్చరించాడు. తాను కరోనా నుంచి కోలుకుని మళ్లీ పనులు స్టార్ట్ చేశానని, తన కోసం ప్రార్థించిన వారికి, చికిత్స అందించిన వైద్యులకు, బీఎంసీ సిబ్బందికి ఆ పోస్టులో ధన్యవాదాలు తెలిపాడు.



 




 


ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటిస్తూ కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాడు. చిన్నాపెద్దా తేడా లేకుండా కరోనా వైరస్ అందరినీ ఇబ్బందులకు గురిచేస్తుందని, అందుకే కోవిడ్19 నిబంధనలు పాటించాలని అభిమానులకు పిలుపునిచ్చాడు అర్జున్ కపూర్.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe