Sharwanand Marriage | కరోనా వైరస్, లాక్‌డౌన్ టైమ్ టాలీవుడ్ సెలబ్రిటీలకు బాగా కలిసొచ్చింది. ఓవైపు కరోనా అని కంగారు పడుతున్నా.. మరోవైపు లేకలేక దొరికిన ఖాళీ సమయాన్ని కెరీర్‌లో ముఖ్య ఘట్టాలకు కేటాయిస్తున్నారు టాలీవుడ్ యంగ్ హీరోలు. తొలుత నిఖిల్, నితిన్‌లు, నిర్మాత దిల్ రాజు పెళ్లిపీటలెక్కగా.. ఇటీవల భళ్లాలదేవుడు రానా సైతం కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. మొన్న మెగా డాటర్ నిహారిక నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు శర్వానంద్ పెళ్లి (Sharwanand Wedding) వంతు వచ్చింది.  Malaika Arora Yoga Pics: నటి మలైకా అరోరా యోగా ఫొటోస్ ట్రెండింగ్ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోగా ఎదిగిన శర్వానంద్ (Sharwanand GirlFriend)‌కు జాను దొరికేసిందని టాక్ వినిపిస్తోంది. చిన్ననాటి స్నేహితురాలితో నటుడు శర్వానంద్ ప్రేమలో ఉన్నాడని.. త్వరలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నాడని సమచారం. శర్వా ప్రేమించిన అమ్మాయి వ్యాపారవేత్త అని ప్రచారం జరుగుతోంది. చిన్ననాటి నుంచే పరిచయం ఉన్న అమ్మాయి కావడంతో శర్వా ప్రేమలో పడ్డాడని, త్వరలోనే ఈ విషయాన్ని తెలుపుతాడని టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఉపాసన ఫ్యామిలీకి చెందిన అమ్మాయి అని కూడా విషయం వైరల్ అవుతోంది. Prabhas నో చెబితే ఆది పురుష్ తీసేవాడ్ని కాదు‌: డైరెక్టర్


రానా బాటలోనే శర్వా నడవబోతున్నాడు. రానా సైతం ప్రేమలో విజయం సాధించి పెద్దలతో మాట్లాడి అరెంజ్‌డ్ మ్యారేజ్ చేసుకున్నాడు. రానా భార్య మిహీకా బజాజ్ లాగ.. శర్వా ప్రేమించిన అమ్మాయి సైతం వ్యాపారవేత్త. శర్వానంద్ పెళ్లిపీటలు ఎక్కడం నిజమైతే బ్యాచిలర్స్ గ్రూప్ నుంచి ఔట్ అవుతాడు. ఇక రెబల్ స్టార్ ప్రభాస్, సాయి ధరమ్ తేజ్‌లు ఎప్పుడు పెళ్లి వార్త చెబుతారా అని టాలీవుడ్ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. Shalini Vadnikatti Wedding Photos: దర్శకుడిని పెళ్లాడిన యంగ్ హీరోయిన్