Hero Vishal: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఇంటిపై రాళ్లతో దాడి.. ధ్వంసమైన అద్దాలు..
Hero Vishal: ప్రముఖ నటుడు విశాల్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడి జరిగిన సమయంలో విశాల్ ఇంట్లో లేరు.
Hero Vishal: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఇంటిపై కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఇప్పుడు ఈ ఘటన తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ప్రస్తుతం చెన్నైలోని అన్నానగర్ లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు విశాల్. సోమవారం రాత్రి కొంత మంది ఆగంతకులు ఎర్రటి కారులో వచ్చి విశాల్ ఇంటిపై రాళ్లు దాడి చేసినట్లు సీసీటీవీ పుటేజీలో రికార్డు అయింది. ఈ ఘటనలో విశాల్ ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై విశాల్ తన మేనేజర్ ద్వారా చెన్నైలోని అన్నా నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబందించిన రికార్డింగ్స్ ను కూడా విశాల్ మేనేజర్ పోలీసులకు అందించాడు. ఈ దాడి జరిగిన సమయంలో విశాల్ ఇంట్లో లేరు. షూటింగ్ నిమిత్తం బయటకు వెళ్లారు.
ప్రస్తుతం విశాల్ తమిళ చిత్ర పరిశ్రమ నడిగర సంఘం జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఈయనంటే సినీ పరిశ్రమలో గిట్టని వారే ఈ దాడికి పాల్పడ్డారా.. లేక మరేదైనా ఇతర కారణాలు ఉన్నాయనే అనే కోణంలో పోలీసులు పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. సినిమాలు విషయానికొస్తే... ప్రస్తుతం లాఠీ. తుపరివాలన్-2, మార్క్ ఆంటోని చిత్రాల్లో నటిస్తున్నాడు విశాల్. ఇటీవల రిలీజైన లాఠీ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘తుప్పారివాలన్’ (డిటెక్టివ్ 2) మెుదటి భాగం విజయం సాధించడంతో రెండో భాగం కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. గతేడాది చక్ర, సామాన్యుడి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన విశాల్ నిరాశపరిచాడు.
Also Read: Mahesh Babu Mother Indira Devi: మహేష్ బాబు ఇంట తీవ్ర విషాదం.. ఆ బాధ నుంచి బయటపడేలోపే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook