మహేష్ బాబుకు అమ్మగా చేస్తా.. కానీ!: నటి రిప్లై అదుర్స్!
రేణు దేశాయ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారి తీశాయి. తాను మహేష్ బాబు, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలకు తల్లిగా చేసేందుకు సిద్ధమేనంటోంది.
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయాక నటి రేణు దేశాయ్ తన పనుల్లో ఆమె బిజీగా ఉన్నారు. సినిమాలు, కవిత్వం, రచనలు ఇలా బిజీగా గడుపుతున్నట్లు చెబుతోంది రేణు. అయితే తాజాగా ఓ మీడియాతో ఇంటర్వ్యూలో భాగంగా రేణు దేశాయ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారి తీశాయి. తాను మహేష్ బాబు, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలకు తల్లిగా చేసేందుకు సిద్ధమేనంటోంది. ఎన్నిసార్లు అడిగినా నా వయసు చెబుతా.. మీరు నమ్మరుగా!
నిజంగానే తన పాత్రకు బలం ఉండి, మంచి క్యారెక్టర్ అయితే తల్లి పాత్రలు చేసేందుకు తాను వెనకాడనని స్పష్టం చేసింది రేణు దేశాయ్. అయితే వయసులో ఆమెకంటే పెద్ద హీరోలకు సైతం తల్లిపాత్ర చేస్తానని చెప్పింది. మహేష్ బాబు, ప్రభాస్‌లకు తల్లిగా నటించాల్సి వస్తే ఓకే చెబుతానని అంటూనే ఓ ట్విస్ట్ ఇచ్చింది. తనకు ప్రాధాన్యమున్న పాత్ర అయితే ఆ హీరోల చిన్నప్పుడు క్యారెక్టర్‌లకు తల్లిపాత్ర చేస్తానంది. ఫ్లాష్ బ్యాక్ పాత్రలో ఆ హీరోలకు అమ్మగా నటించేందుకు ఇబ్బంది లేదంటోంది. యాంకర్ అనసూయ ఫన్నీ ఫొటోషూట్
ప్రొడక్షన్ హౌస్, డైరెక్టర్ అంశాలతో పాటు సినిమాలో ఒక్క నిమిషం పాత్ర అయినా సరే తనకు ప్రాముఖ్యత ఉంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ చేయడానికి వెనకాడనని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం తన సినిమాలు, రైటింగ్‌తో బిజీగా ఉన్నానని, తనను ఆధరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తనను స్నేహితులు సైతం అమ్మ రేణు దేశాయ్ అని పిలుస్తారని, తాను అందరికీ తల్లి రేణు దేశాయ్ అంటూ ఆసక్తికర కామెంట్లు చేసింది సీనియర్ నటి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Photos: కేఎల్ రాహుల్, అతియా శెట్టి క్రేజీగా!
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!
‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos