నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య (Sushant Singh Rajput Suicide) అనంతరం బాలీవుడ్‌‌తో పాటు దేశంలోని అన్ని సినీ ఇండస్ట్రీలలో వారసత్వం, బంధుప్రీతిపై విమర్శలు తీవ్రతరం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సినీ నేపథ్యం ఉన్న ఇంటి నుంచి ఓ నటుడు అరంగేట్రం చేయబోతున్నాడు. మాజీ విశ్వసుందరి, నటి సుస్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ (Rajeev Sen Bollywood Debut) ‘ఇతి: కెన్ యు సాల్వ్ యువర్ ఓన్ మర్డర్?’ మూవీతో బాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడు. విశాల్ మిశ్రా ఈ సినిమాకు కథను అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నాడు. జులైలో బ్యాంకు సెలవులు ఇవే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘నటన, సినిమాలు, నేర్చుకోవడం అనేది నా జీవితంలో ఎప్పుడో భాగమైంది. తొలి సినిమానే చాలా ఆసక్తికర అంశం కావడం సంతోషాన్నిస్తోంది. ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను. చిన్ననాటి నుంచి నాలో ఉన్న తపన, నటన, క్రియేటివిటి చూసిన సన్నిహితులు సినిమాల్లో నటించాలని తరచుగా కోరేవారని’ రాజీవ్ సేన్ (Rajeev Sen) ఓ ప్రకటనలో తెలిపాడు. త్వరలోనే మీ ఇళ్లల్లో ఈ బాంబ్ పేలనుంది


సోదరి సుస్మితా సేన్ నుంచి ఎంతో ప్రేరణ పొందాను. ఆమె ప్రభావం నాపై కచ్చితంగా ఉంటుంది. తన కాళ్లపై తాను నిలబడ్డ వ్యక్తి సుస్మితా సేన్. గ్లోబల్ ఐకాన్‌గానూ మారింది. ఆమె సోదరుడిని అయితనందుకు గర్విస్తున్నాను. అయితే సినిమాలు కేవలం నా టాలెంట్ మీద ఆధారపడాలని భావిస్తున్నాను.  సూపర్ టీమ్‌తో కలిసి నా తొలి సినిమా చేస్తున్న. తొలి సినిమా వివరాలు చాలా సంతోషంగా వెల్లడిస్తున్నట్లు అరంగేట్ర నటుడు రాజీవ్ సేన్ తెలిపాడు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ