త్వరలోనే మీ ఇళ్లల్లో ఈ బాంబ్ పేలనుంది

బాలీవుడ్‌ అగ్రనటుడు అక్షయ్ కుమార్, నటి కియారా అద్వానీ నటించిన హారర్-కామెడీ మూవీ 'లక్ష్మీ బాంబ్' (Laxmmi Bomb) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 

Last Updated : Jun 30, 2020, 12:53 PM IST
త్వరలోనే మీ ఇళ్లల్లో ఈ బాంబ్ పేలనుంది

బాలీవుడ్‌ అగ్రనటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar), కియారా అద్వానీ (Kiara Advani) నటించిన హారర్-కామెడీ చిత్రం 'లక్ష్మీ బాంబ్' (Laxmmi Bomb) గురించి సోమవారం కీలక ప్రకటన వెలువడింది. ఈ చిత్రానికి రాఘవ లారెన్స్ (Raghava Lawrence) దర్శకత్వం వహిస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. కొన్ని నెలలుగా ఈ చిత్రం కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్రాన్ని మే 22నే విడుదల చేయాలనుకున్నా.. కరోనా వైరస్ లాక్డౌన్ (lockdown) వల్ల సాధ్యం కాలేదు.  సుశాంత్ ఆత్మహత్య కేసులో మరో సంచలన ట్విస్ట్..

చివరకు చిత్ర నిర్మాతలు ప్రేక్షకులను అలరించడానికి ఈ చిత్రాన్ని ఓటీటీ (Laxmmi Bomb On OTT) ప్లాట్‌ఫాంపై విడుదల చేయడానికి సన్నద్ధమయ్యారు. ఈ మేరకు స్వయంగా అక్షయ్ కుమార్, కియారా అద్వానీ తమ తమ సోషల్ మీడియా సైట్ల ద్వారా వెల్లడించారు. అంతేకాకుండా అక్షయ్ డిస్నీ + హాట్‌స్టార్ లైవ్ ప్రొగ్రాంలో రెండు విభిన్నమైన పోస్టర్లతోపాటు తన అనుభవాలను పంచుకున్నాడు. Petrol Price Today: నేటి పెట్రోల్, డీజిల్ ధరలు

నవ్వుతారు.. భయపడతారు.. అక్షయ్..
ఈ మేరకు అక్షయ్ కుమార్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొత్త పోస్టర్‌ను షేర్ చేసి ఇలా రాశాడు.  ‘‘లక్ష్మీ బాంబ్ చిత్రాన్ని మొదటి రోజున మీరు మీ ఇంట్లోనే చూడవచ్చు. రెండు విషయాల్లో మీకు గ్యారెంటీ ఇస్తున్నా..  నవ్వడంతోపాటు భయపడతారు’’ అని పేర్కొన్నాడు.

త్వరలోనే మీ ఇళ్లల్లో బాంబ్ పేలుతుంది.. కియారా
నటి కియారా అద్వానీ కూడా ఈ మేరకు ఒక ట్వీట్‌ చేసింది. ‘‘త్వరలోనే మీ ఇళ్లల్లో ఈ బాంబ్ పేలనుంది. లక్ష్మీబాంబ్ మొదటి షో  మీ ఇంట్లోనే DisneyPlusHSVIPలో అలరించనుంది’’ అని తెలిపింది.

దీంతో అభిమానులు కొన్నినెలలుగా ఎంతో ఆసక్తిగా ఎదురుచుస్తూన్న 'లక్ష్మీ బాంబ్' చిత్రానికి త్వరలోనే తెరపడనుంది.   జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..   
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ

Trending News