పంది పిల్ల కథ ఆధారంగా సినిమాను తెరకెక్కించవచ్చని చెబుతూ నటుడు, దర్శకుడు రవిబాబు చేస్తోన్న మరో సరికొత్త ప్రయోగమే అదుగో మూవీ. రవిబాబు, నభా నతేష్, పూర్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా కథాంశం అంతా ఓ పంది పిల్ల చుట్టూ తిరుగుతుంటుంది. ఎంతో గ్రాఫిక్స్ వర్స్క్ ఉపయోగించి ఈ సినిమాలో రవిబాబు తెరకెక్కించిన పంది పిల్ల సన్నివేశాలు ఇప్పటికే ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. దీపావళి సందర్భంగా ఈరోజే ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఓ మేకింగ్ వీడియోను విడుదల చేశారు.