నాగార్జున, నాని హీరోలుగా తెరకెక్కనున్న మల్టీస్టారర్ సినిమా ఈ ఉగాది నుండి సెట్స్ పైకి వెళ్లనుంది.  వైజయంతి మూవీస్‌ పతాకంపై టి.శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో నిర్మాత సి.అశ్వనీదత్‌ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ కి ప్యాకప్ చెప్పేసిన ఫిల్మ్ మేకర్స్, ప్రస్తుతం యూఎస్ లో మ్యూజిక్ సిట్టింగ్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్ ఈ నెల 18వ తేది ఉగాది రోజు నుంచి ప్రారంభ‌కానుంది. ఈ సందర్భంగా నిర్మాత సి.అశ్వనీదత్‌ మాట్లాడుతూ 'మా వైజయంతి బేనర్‌లో మణిశర్మ చేసిన సినిమాలన్నీ మ్యూజికల్‌గా నిలిచాయి. ఈ సినిమాని కూడా మ్యూజికల్‌గా హిట్‌ చెయ్యాలని ఆసక్తిని చూపిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఈ సినిమాలోని సాంగ్స్‌ని మణిశర్మ కంపోజ్‌ చేస్తున్నారు. మూడు పాటలకు సంబంధించిన మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ అక్కడ జరుగుతున్నాయి. ఉగాది రోజు నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తున్నాం' అన్నారు.  


'మా బేనర్‌లో ఎన్నో మల్టీస్టారర్స్‌ చేశాం. అవన్నీ కమర్షియల్‌గా ఘనవిజయాల్ని సాధించాయి. ఇప్పుడు నాగార్జున, నాని కాంబినేషన్‌లో చేస్తున్న మల్టీస్టారర్‌ కూడా బిగ్గెస్ట్‌ హిట్‌ అయి మా బేనర్‌కి మరింత మంచి పేరు తెస్తుంది' అని అన్నారు. ప్రస్తుతం నాగార్జున సరసన హీరోయిన్ ని ఫిక్స్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్న సినిమా యూనిట్, నాని సరసన రకుల్ ని ఆల్ రెడీ ఫిక్స్ చేసుకున్నారనే టాక్ గట్టిగానే వినిపిస్తుంది.