Sittharala Sirapadu Song: ‘అల వైకుంఠపురములో’ నుంచి మరో హిట్ సాంగ్ ‘సిత్తరాల సిరపడు’
సంక్రాంతి పండుగ తర్వాత అభిమానులకు మరో పాట అందజేసింది ‘అల వైకుంఠపురంలో’ మూవీ యూనిట్. ‘సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు’ అనే లిరికల్ వీడియోను తాజాగా రిలీజ్ అయింది. విజయ్ కుమార్ భళ్లా సాహిత్యం అందించిన ఈ పాటను సింగర్స్ సూరన్న, సాకేత్ కోమండురి ఆలపించగా
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో’. సంక్రాంతి బరిలో నిలిచిన బన్నీ సినిమా భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో బన్నీగా జోడీగా పూజా హెగ్డే నటించింది. అల వైకుంఠపురం సక్సెస్‌లో సంగీతం కూడా ప్రధాన పాత్ర పోషించింది. విడుదలకు ముందే మ్యూజికల్ హిట్ కావడం సినిమాలపై అంచనాలు పెంచేసింది.
సంక్రాంతి పండుగ తర్వాత అభిమానులకు మరో పాట అందజేసింది మూవీ యూనిట్. ‘సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు’ అనే లిరికల్ వీడియోను తాజాగా రిలీజ్ అయింది. విజయ్ కుమార్ భళ్లా సాహిత్యం అందించిన ఈ పాటను సింగర్స్ సూరన్న, సాకేత్ కోమండురి ఆలపించగా.. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ స్వరాలు సమకూర్చాడు. అయితే రెగ్యూలర్‌గా కాకుండా ఈ పాటను ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్‌లతో కంపోజ్ చేయించాడు త్రివిక్రమ్.
మరోవైపు బాక్సాఫీసు వద్ద నాన్ బాహుబలి రికార్డులను తిరగరాస్తున్నాడు బన్నీ. త్రివిక్రమ్, బన్నీల కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా కూడా సక్సెస్ అయి హ్యాట్రిక్ హిట్ అందుకున్నారు. తన గత సినిమాల రికార్డులను అల వైకుంఠపురంతో అధిగమిస్తున్న బన్నీ.. మరెన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకుంటాడోనన్న టాక్ వినిపిస్తోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.