అల్లుఅర్జున్ ఇచ్చిన కాంప్లిమెంట్ ఎన్నటికీ మర్చిపోలేనిది
సామాజిక మాధ్యమాల్లో కంటిచూపుతూ యావత్ దేశాన్నే తనవైపు తిప్పుకొని బోలెడు పాపులారిటీ సంపాదించుకున్న మళయాళ నటి ప్రియ ప్రకాశ్ వారియర్ ను పలువురు ప్రముఖులు కొనియాడిన సగంతి తెలిసిందే.!
సామాజిక మాధ్యమాల్లో కంటిచూపుతూ యావత్ దేశాన్నే తనవైపు తిప్పుకొని బోలెడు పాపులారిటీ సంపాదించుకున్న మళయాళ నటి ప్రియ ప్రకాశ్ వారియర్ ను పలువురు ప్రముఖులు కొనియాడిన సగంతి తెలిసిందే.! ఆమెను టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ప్రశంసిస్తూ ఒక ట్వీట్ చేశాడు. మళయాళ సినీ ఇండస్ట్రీలో అల్లుఅర్జున్ కి అభిమానులు ఎక్కువ. ప్రియ ప్రకాశ్ కూడా అల్లు అభిమానే.
బన్నీ ‘ఇప్పటివరకు నేను చూసిన క్యూట్ వీడియోల్లో ఇది ఒకటి. పవర్ ఆఫ్ సింప్లిసిటీ. లవ్ ఇట్’ అని ట్వీట్ చేస్తూ ప్రియ వీడియోను షేర్ చేశాడు.
తాజాగా ప్రియ, మూవీ ప్రమోషన్ లో భాగంగా కో-స్టార్ రోషన్ అబ్దుల్ రహూఫ్తో కలిసి ఓ మలయాళ ఛానెల్ నిర్వహించిన చాట్ షోలో పాల్గొన్నారు. తన కంటిచూపు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయినప్పటికీ అల్లు అర్జున్ ఇచ్చిన కాంప్లిమెంట్ మాత్రం మర్చిపోలేనని ఈ సందర్భంగా ప్రియ తెలిపింది.
‘అభిమానుల నుంచి నాకు ఇంతలా ఆదరణ, ప్రశంసలు లభించినా.. అల్లు అర్జున్ ఇచ్చిన కాంప్లిమెంట్ మాత్రం ఎన్నటికీ మర్చిపోలేనిది. కేరళలో అర్జున్‌కి అభిమానులు ఎక్కువ’ అని తెలిపింది ప్రియ. ఆమె కథానాయికగా నటించిన చిత్రం 'ఒరు అదర్ లవ్’. ఈ చిత్రం మార్చిలో ప్రేక్షకుల ముందు రానుంది.