Amrutha comments on RGV: హైదరాబాద్: మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్యకు ( Pranay murder) గురైన అనంతరం ఆయన భార్య అమృత ఎంత మనోవేధనకు గురయ్యారో అందరికీ తెలిసిందే. అన్నింటికి మించి ఇటీవల హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఆమె తండ్రి మారుతి రావు ఆత్మహత్య ( Maruti Rao suicide) చేసుకోవడం సంచలనం సృష్టించింది. ఇవన్నీ సీక్వెల్స్ ఆధారంగా చేసుకుని ఓ సినిమాను ప్లాన్ చేసిన రాంగోపాల్ వర్మ.. ఆ చిత్రానికి మర్డర్ అనే పేరు పెట్టడం.. ఆ టైటిల్ కింద కుటుంబ కథా చిత్రం అనే క్యాప్షన్ పెట్టి ఫస్ట్ లుక్ ( Murder movie first look ) రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆర్జీవీ విడుదల చేసిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌పై అమృత ( Amrutha ) స్పందిస్తూ.. వర్మపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తన కథ పేరుతో రాంగోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న మర్డర్ మూవీకి తన రియల్ లైఫ్‌కి ఏ సంబంధం లేదని అమృత స్పష్టం చేశారు. తన జీవితంలో ఏం జరిగిందనేది తన సన్నిహితులకు తప్ప ఇంకెవరికీ తెలియదన్న ఆమె.. అన్ని అంశాలపై ఉపన్యాసాలిచ్చే ఆ దర్శకుడు వర్మకు (Ramgopal Varma).. మరొకరి కథ చెప్పబోయే ముందు వారి అనుమతి తీసుకోవాలనే విషయం కూడా తెలియదా ? అని మండిపడ్డారు. ఇప్పటికే నా జీవితం తలకిందులైంది. నా భర్త ప్రణయ్ హత్య, తండ్రి మారుతి రావు ఆత్మహత్య అనంతరం తీవ్ర మనోవేధనతో బతుకీడుస్తున్న నాకు.. వర్మ విడుదల చేసిన మర్డర్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ చూశాకా ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని ఆవేదన వ్యక్తంచేశారు. 


" వర్మ సొంతంగా రాసుకున్న ఓ కట్టుకథకు మా పేర్లు చెప్పుకుని అమృత బయోపిక్ మూవీ ( Amrutha biopic movie) అనే తరహాలో అమ్ముకోవాలని చూస్తున్నాడు. అందువల్ల ఆయనకు పబ్లిసిటీ వచ్చుంటుంది. మహిళలను ఎలా గౌరవించాలో వర్మకు తెలియదు. ఆ విషయాలు చెప్పడానికి ఆయనకు తల్లి కూడా లేనందుకు అతడిపై జాలిపడుతున్నా" అని అమృత అభిప్రాయపడింది. వర్మ లాంటి ఫేక్‌ ఫిలిం మేకర్‌పై పోలీసు కేసు పెట్టి ఆయనకు ఉచితంగా పబ్లిసిటీ కల్పించడం తనకు ఇష్టం లేదని అమృత పేర్కొన్నారు.