Anjali Special Song in Macherla Niyojakavargam: చివరిగా భీష్మ అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నితిన్ తర్వాత మరో హిట్ కొట్టేందుకు చాలా ప్రయత్నిస్తున్నారు.  కానీ నితిన్ చేసిన చెక్, రంగ్ దే, మాస్ట్రో సినిమాలు మాత్రం నిరాశ పరిచాయి. ప్రస్తుతం నితిన్ దర్శకుడిగా మారిన ఎడిటర్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో మాచర్ల నియోజకవర్గం అనే సినిమా చేస్తున్నారు. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న పాత్రలు, అలాంటి సినిమాలే చేయడానికి ఆసక్తి చూపించే నితిన్ ఈ సారి మొట్ట మొదటిసారిగా ఒక పొలిటికల్ థ్రిల్లర్ కథలో ఐఏఎస్ అధికారి పాత్రలో కనిపించబోతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సహా కొంత ప్రమోషనల్ స్టఫ్ సినిమా మీద ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడడానికి కారణమయ్యాయి. ఆగస్టు 12వ తేదీన సినిమాను విడుదల చేస్తున్న నేపథ్యంలో విడుదలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో ఈ సినిమా నుంచి అప్డేట్స్ ఇవ్వడం ప్రారంభించారు మేకర్స్. ఈక్రమంలోనే ఒక స్పెషల్ సాంగ్ కి సంబంధించిన అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈ మధ్య హీరోయిన్లు కాస్త క్రేజ్ తగ్గింది అనుకోగానే ఐటమ్ సాంగ్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. 


వారే కాదు సమంత, పూజా హెగ్డే లాంటి హీరోయిన్లు మంచి ఫామ్ లో ఉన్నా సాంగ్స్ చేస్తుంటే మాకేం ఇబ్బంది అని కొంత అవకాశాలు తగ్గిన హీరోయిన్స్ కూడా ఐటెం సాంగ్స్ కి సై అంటున్నారు. అందులో భాగంగానే నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమాలో హీరోయిన్ అంజలి స్పెషల్ సాంగ్ లో ఆడి పాడడానికి సిద్ధమైంది. సాంగ్ అనౌన్స్మెంట్ త్వరలోనే ఉండబోతుందని ఈ సినిమా మేకర్స్ ప్రకటించారు. 


మణిశర్మ కుమారుడు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నితిన్ గుంటూరు జిల్లా కలెక్టర్గా కనిపించబోతున్నాడు. చేసిన మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కృతి శెట్టి, కేథరిన్ తెరిసాలు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆదిత్య మూవీస్ - శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ల పైన సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Also Read: Actor Naresh -Pavitra Lokesh: రెడ్ హ్యాండెడ్ గా ఒకే గదిలో దొరికిన నరేష్-పవిత్ర.. చెప్పుతో కొట్టబోయిన రమ్య రఘుపతి!


Also Read: Anchor Anasuya as prostitute: వేశ్యగా యాంకర్ అన‌సూయ‌.. ఆ దర్శకుడి హామీతో..!!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook