Actor Naresh -Pavitra Lokesh: రెడ్ హ్యాండెడ్ గా ఒకే గదిలో దొరికిన నరేష్-పవిత్ర.. చెప్పుతో కొట్టబోయిన రమ్య రఘుపతి!

Actor Naresh -Pavitra Lokesh at Mysore Hotel: పవిత్ర లోకేష్- నరేష్ కలిసి ఒక హోటల్లో బస చేసిన నేపథ్యంలో ఆ హోటల్లో రచ్చ చేయడానికి ప్రయత్నించారు నరేష్ మూడో భార్య రమ్యా రఘుపతి. నరేష్- పవిత్ర లోకేష్ హోటల్లో బస చేశారు అన్న విషయం తెలుసుకున్న రమ్య రఘుపతి చెప్పుతో పవిత్రపై దాడి చేయడానికి ప్రయత్నించినట్లు సమాచారం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 3, 2022, 12:20 PM IST
  • మైసూరులో రెడ్ హ్యాండెడ్ గా ఒకే గదిలో దొరికిన నరేష్-పవిత్ర

    చెప్పుతో కొట్టబోయిన రమ్య రఘుపతి
  • పోలీసుల రక్షణతో అక్కడి నుంచి వెళ్లిపోయిన నరేష్-పవిత్ర
Actor Naresh -Pavitra Lokesh: రెడ్ హ్యాండెడ్ గా ఒకే గదిలో దొరికిన నరేష్-పవిత్ర.. చెప్పుతో కొట్టబోయిన రమ్య రఘుపతి!

Actor Naresh -Pavitra Lokesh at Mysore Hotel: నటుడు, మాజీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్ వ్యవహారం గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు కన్నడ రాష్ట్రంలో కూడా హాట్ టాపిక్గా మారింది. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి కన్నడ మీడియా ముందు అటు నరేష్ తో పాటు పవిత్ర లోకేష్ మీద సంచలన ఆరోపణలు చేయడం సంచలనం రేపింది. ఈ క్రమంలో ఒకపక్క నరేష్ మరోపక్క పవిత్ర లోకేష్ కూడా వేర్వేరుగా వీడియోలు విడుదల చేసి తమను సపోర్ట్ చేయాల్సిందిగా తెలుగు ప్రేక్షకులను అభ్యర్థించారు. 

అయితే ఇప్పుడు తాజాగా మైసూరు కేంద్రంగా పెద్ద వివాదం చెలరేగింది. పవిత్ర లోకేష్- నరేష్ కలిసి ఒక హోటల్లో బస చేసిన నేపథ్యంలో ఆ హోటల్లో రచ్చ చేయడానికి ప్రయత్నించారు నరేష్ మూడో భార్య రమ్యా రఘుపతి. నరేష్- పవిత్ర లోకేష్ హోటల్లో బస చేశారు అన్న విషయం తెలుసుకున్న రమ్య రఘుపతి ఆ హోటల్ బయట ధర్నాకు దిగినట్లు సమాచారం. అంతేకాక వారిద్దరూ ఒకే గదిలో ఉన్నారని చెబుతూ వారి గది తలుపులు కూడా ఆమె ఆపకుండా కొట్టడంతో నరేష్ వెంటనే పోలీసులను ఆశ్రయించారు. 

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సదరు హోటల్ వద్దకు వచ్చి అక్కడి నుంచి పవిత్రను నరేష్ పక్కకు తప్పించినట్లు సమాచారం. అయితే పోలీసులు వారిని తప్పిస్తున్న క్రమంలో నరేష్ భార్య రమ్య రఘుపతి చెప్పుతో పవిత్రపై దాడి చేయడానికి ప్రయత్నించినట్లు సమాచారం. నరేష్-పవిత్ర లోకేష్ వెళ్లిపోయిన తర్వాత కూడా రమ్య రఘుపతి వారికి వ్యతిరేకంగా హోటల్ ముందు నిరసనకు దిగి స్లోగన్స్ వినిపించినట్లు సమాచారం. 

అయితే అక్కడే ఉన్న పోలీసులు రమ్యను అడ్డుకుని నరేష్ పవిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోయే వరకు ఆమెను అదుపులో ఉంచినట్లు సమాచారం. ఇక బయటకు వచ్చిన విజువల్స్ ప్రకారం నరేష్, పవిత్ర లోకేష్ కూడా ఇద్దరూ ఒకే గదిలోంచి బయటకు వస్తూ కనిపించారు. అయితే వారి మీద దాడి చేయడానికి రమ్య రఘుపతి ప్రయత్నిస్తున్న క్రమంలో ఆమెను పోలీసులు బలంగా నిర్బంధించారు. అయితే లిఫ్ట్ లో కిందకి వెళ్ళిపోతూ కూడా నరేష్ రమ్యను చూస్తూ విజిల్స్ వేస్తున్న విజువల్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Also: Anchor Anasuya: ఆ దర్శకుడి హామీతో వేశ్య పాత్రకు సై అన్న యాంకర్ అన‌సూయ‌?

Read Also: Acharya: టైటిలే కరెక్ట్ కాదు.. ఆయనతో ఐటెం సాంగా? ఆచార్యపై పరుచూరి సంచలన వ్యాఖ్యలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News