Anchor Anasuya as prostitute: వేశ్యగా యాంకర్ అన‌సూయ‌.. ఆ దర్శకుడి హామీతో..!!

Anasuya Bharadwaj prostitute role: యాంకరింగ్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించిన అనసూయ భరద్వాజ్ ఇప్పుడు సినిమాల్లో నటిస్తోంది. ఇక ఆమె వేశ్య పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెబుతున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 3, 2022, 11:40 AM IST
  • వేశ్య పాత్రకు సై అన్న యాంకర్ అన‌సూయ‌?
  • రాజీవ్ రెడ్డి నిర్మాణంతో క్రిష్ రచనా సహకారంతో వెబ్ సిరీస్
  • మధురవాణి అనే వేశ్య పాత్రలో అన‌సూయ‌
Anchor Anasuya as prostitute: వేశ్యగా యాంకర్ అన‌సూయ‌.. ఆ దర్శకుడి హామీతో..!!

Anchor Anasuya Bharadwaj to play prostitute role: యాంకర్ గా బుల్లితెరకు పరిచయమైన అనసూయ భరద్వాజ్ తర్వాత కాలంలో సినీ రంగ ప్రవేశం చేసిన సంగతి  తెలిసిందే. రామ్ చరణ్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త అనే పాత్రలో నటించిన ఆమె తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. చనిపోయిన భర్త దుబాయ్ లో ఉన్నాడంటూ ప్రజలను నమ్మించి బతికే ఒక అసహాయ మహిళ పాత్రలో ఆమె జీవించింది. ఇక అలా రంగస్థలం సినిమా తర్వాత అనేక సినిమా అవకాశాలు ఆమెను తలుపు తట్టాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒప్పేసుకుని చేసేయకుండా తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న పాత్రలే చేస్తున్నారు. 

ఇటీవలే పుష్ప ది రైజ్ సినిమాలో దాక్షాయని అనే పాత్రతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్న అనసూయ ఈ మధ్యనే సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టింది. జీవితంలో పెద్ద నిర్ణయం తీసుకున్నానని ఆమె పోస్ట్ పెట్టడంతో బహుశా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పబోతోంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆ సంగతి అలా ఉంచితే ఇప్పుడు అనసూయ తన లైఫ్లో ఒక బోల్డ్ పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం మొదలైంది. 

తెలుగులో కూడా ఇప్పుడు డిజిటల్ కంటెంట్ కి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో బడా దర్శక నిర్మాతలు కూడా వెబ్ సిరీస్లు నిర్మించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగానే దర్శకుడు క్రిష్ తన స్నేహితుడు రాజీవ్ రెడ్డితో కలిసి వరుసగా వెబ్ సిరీస్ నిర్మాణాలు చేస్తున్నారు. రాజీవ్ రెడ్డి నిర్మాణంతో క్రిష్ రచనా సహకారంతో ఈ వెబ్ సిరీస్ లు రూపొందుతున్నాయి. తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం కాన్సెప్ట్ తో క్రిష్ ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ రూపొందించే అవకాశం ఉందని తెలుస్తోంది. దానికి కథ-కథనం స్క్రిప్ట్ బాధ్యతలు అన్నీ క్రిష్ చూసుకోబోతున్నారట. 

దీనికి ఒక కొత్త దర్శకుడికి డైరెక్షన్ అవకాశం ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈ సిరీస్ లోనే అనసూయ భరద్వాజ్ మధురవాణి అనే వేశ్య పాత్రలో కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. ముందుగా వేశ్య పాత్ర అని కొంచెం వెనకడుగు వేసినా ఈ పాత్ర లైఫ్ టర్నింగ్ గా ఉంటుందని క్రిష్ ఒప్పించడంతో ఆమె సిరీస్ చేయడానికి సిద్ధం అయిందని అంటున్నారు. ఎలాంటి పాత్ర అయినా చేయడానికి సిద్ధమని సూచనలు ఇవ్వడానికి అనసూయ భరద్వాజ్ ఈ పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. ఆమెకు వరుస సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి కాబట్టే నెమ్మదిగా టీవీ షోస్ తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే నెటిజన్ల ట్రోలింగ్ కు తరచూ గురవుతూ ఉండే అనసూయ ఈ వేశ్య పాత్ర ఎంచుకొని నటిస్తే మాత్రం ట్రోలర్లకు మరింత అవకాశం ఇచ్చినట్లు అవుతుంది.
 Also Read: Acharya: టైటిలే కరెక్ట్ కాదు.. ఆయనతో ఐటెం సాంగా? ఆచార్యపై పరుచూరి సంచలన వ్యాఖ్యలు!

 Also Read: Anchor Shiva: రాశిఖన్నాతో పులిహోర.. ఏకంగా పెళ్లికి టెండర్ పెట్టాడుగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News