Sirivennela Sitaramasastri: తెలుగు సినీ పరిశ్రమకు మరో షాక్ ఎదురైంది. ప్రముఖ సినీ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరు. అనారోగ్యంతో కాస్సేపటి క్రితం తుది శ్వాస విడిచారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాలీవుడ్‌కు ఊహించని కోలుకోలేని షాక్ తగిలింది. సినీ పరిశ్రమ మొత్తం విషాదంలో మునిగిపోయే వార్త ఇది. ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి(Sirivennela Died) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన...కాస్సేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. 


తాజాగా సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Sitaramasastri)రాసిన పాట రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలోని దోస్తీ పాట. ఈ పాట ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. 1986లో సిరివెన్నెల సినిమాతో పాటల రచయితగా ఆరంగేట్రం చేసిన ఆయన ఇక వెనుదిరిగి చూడలేదు. ఆ సినిమానే ఆయనకు ఇంటిపేరుగా మారింది. అప్పట్నించి సిరివెన్నెలగా స్థిరపడ్డారు. తొలి సినిమానే ఇంటిపేరుగా మార్చుకున్న ఘనత ఆయనది. అప్పట్నించి ప్రారంభమైన సిరివెన్నెల సీతారామశాస్త్రి సినీ ప్రస్థానం దిగ్విజయంగా ముందుకు సాగుతూనే ఉంది. కొన్ని సినిమాల్లో నటించారు కూడా. 2019లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. స్వర్ణకమలం, గాయం, శుభలగ్నం, సింధూరం, చక్రం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు వంటి అద్భుతమైన సినిమాల్లో రాసిన పాటలకు నంది అవార్డులు సాధించారు. నాని హీరోగా వచ్చిన శ్యామ్ సింగరాయ్‌లో ఆయన రాసిన పాటలే చివరివి కావడం గమనార్హం.


Also read: Shiva Shankar Master: శివ శంకర్ మాస్టర్ అంత్యక్రియలు పూర్తి... పాడె మోసిన యాంకర్‌ ఓంకార్‌..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook