Kalasa Movie Trailer Released: బిగ్ బాస్ భామ భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్ ప్రధాన పాత్రల్లో కొండా రాంబాబు డైరెక్షన్‌లో తెరకెక్కిన మూవీ కలశ. చంద్రజ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజ వాడపల్లి నిర్మిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 15న ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సందర్బంగా మూవీ ట్రైలర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు. స్టార్ డైరెక్టర్ మలినేని గోపిచంద్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదలైంది. ఈ సందర్బంగా చిత్రబృందాన్ని ఆయన అభినందించారు. కలశ మూవీ ట్రైలర్ చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఈ సినిమా థ్రిల్లరా..? లేక హర్రరా..? అనేది తెలీకుండా తెలివిగా ట్రైలర్‌ను కట్ చేశారని అన్నారు. కలశ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టి తెరకెక్కించిన డైరెక్టర్ రాంబాబుకు, ప్రొడ్యూసర్‌కు, యాక్టర్స్, టెక్నీషియన్స్‌కు ఆయన ఆల్‌ ది బెస్ట్ చెప్పారు. డిసెంబర్ 15న ఈ మూవీని థియేటర్‌లో చూసి ప్రేక్షకులు సక్సెస్ చేయాలని కోరారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హీరోయిన్ భానుశ్రీ మాట్లాడుతూ.. కలశ మూవీ ట్రైలర్ డైరెక్టర్ మలినేని గోపిచంద్ చేతుల మీదుగా విడుదల కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ నెల 15న సినిమా రిలీజ్ కానుందని.. ఆడియన్స్ బ్లెస్సింగ్స్ కావాలని అన్నారు. ట్రైలర్ లాంచ్ చేసిన గోపిచంద్ మలినేనికి థ్యాంక్స్ చెప్పారు. అనంతరం డైరెక్టర్ కొండా రాంబాబు మాట్లాడుతూ.. కలశ మూవీ ట్రైలర్‌ను చేసిన దర్శకులు మలినేని గోపిచంద్.. తమ టీమ్‌ను మెచ్చుకున్నారని చెప్పారు. డిశంబర్ 15న అందరూ తప్పకుండా కలశ సినిమాను చూడాలని కోరారు. 


ప్రొడ్యూసర్ రాజేశ్వరి చంద్రజ వాడపల్లి మాట్లాడుతూ.. కలశ సినిమాను మిస్ అవ్వకుండా చూడాలని ఆడియన్స్‌కు రిక్వెస్ట్ చేశారు. కలశ సినిమాను ఆదరించి.. తమను ఆశీర్వదించాలని హీరోయిన్ సోనాక్షి వర్మ కోరారు. రోషిణి కామిశెట్టి, జీవా, సమీర్‌, రవివర్మ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను వెంకట్‌ గంగధారి నిర్వర్తించగా.. సంగీతం విజయ్‌ కురాకుల అందించారు. ఎడిటర్‌గా జునైద్‌ సిద్దిఖీ పనిచేశారు. సాగర్‌ నారాయణ లిరిక్స్ రాశారు. 


Also Read:  New Ministers History: తెలంగాణా కొత్త మంత్రుల పూర్తి హిస్టరీ..రాజకీయ అరంగేట్రం వివరాలు..


Also Read:  CM Revanth Reddy: కొత్త ప్రభుత్వంలో ప్రక్షాళన.. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా శివధర్ రెడ్డి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి