Bithiri Sathi: బిత్తిరి సత్తికి కరోనా పాజిటివ్
కరోనావైరస్ ( Coronavirus ) విజృంభిస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎక్కడో ఒక్క చోట జరిగే చిన్న పొరపాటుతో జనం కరోనావైరస్ బారినపడుతున్నారు. కరోనా గురించి అంతగా తెలియని వాళ్లే కాదు.. కరోనా సోకకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతున్న వాళ్లు కూడా కొవిడ్-19 బారినపడుతుండటమే అందుకు నిదర్శనం.
కరోనావైరస్ ( Coronavirus ) విజృంభిస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎక్కడో ఒక్క చోట జరిగే చిన్న పొరపాటుతో జనం కరోనావైరస్ బారినపడుతున్నారు. కరోనా గురించి అంతగా తెలియని వాళ్లే కాదు.. కరోనా సోకకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతున్న వాళ్లు కూడా కొవిడ్-19 బారినపడుతుండటమే అందుకు నిదర్శనం. ప్రజలందరికీ కరోనా బారిన పడకుండా ఎలా ఉండాలి అనే విషయంలో టీవీ షోల ద్వారా ఎన్నో జాగ్రత్తలు చెప్పిన ప్రముఖ టీవీ ప్రెజెంటర్, నటుడు బిత్తిరి సత్తి ( Bithiri Sathi ) కూడా కరోనా నుండి తప్పించుకోలేకపోయాడు. Also read : Sourav Ganguly: ధోనీ రిటైర్మెంట్ గురించి దాదా ఏమన్నాడంటే..
కొన్ని రోజుల నుండి కాస్తంత తలనొప్పి, శరీర నొప్పులు ఉన్నాయని గమనించి, కరోనా టెస్ట్ చేయించుకోగా బిత్తిరి సత్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. వెంటనే అతని కుటుంబంతో పాటు ఇంట్లోనే క్వారంటైన్ అవుతున్నట్టు తెలుస్తోంది. కరోనా లక్షణాలు ( Corona symptoms ) ఎక్కువగా లేనందున బిత్తిరి సత్తి ఇంట్లోనే ఉండి కరోనాను నయం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇదే విషయమై బిత్తిరి సత్తి మాట్లాడుతూ '' సరైన జాగ్రత్తలు తీసుకొని, మంచి పౌష్టికాహారం ( Healthy food ) తీసుకోగలిగితే కరోనాని జయించొచ్చు'' అని చెప్పినట్టుగా టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది. బిత్తిరి సత్తి అసలు పేరు కావలి రవి కుమార్ అనే సంగతి తెలిసిందే. Also read : Health tips: ఉప్పు ఎక్కువ తింటున్నారా ? ఐతే ఈ ప్రాబ్లమ్స్ తప్పవు
బిత్తిరిసత్తి ఓవైపు టీవీ షోలు చేస్తూనే మరోవైపు అవకాశం చిక్కినప్పుడల్లా సినిమాల్లోనూ నటిస్తున్నాడు. నటనపై ఉన్న మక్కువతోనే అవకాశాలు వెతుక్కునే క్రమంలో టీవీ రంగంలోకి అడుగుపెట్టడం.. ఆ తర్వాత వార్తా ప్రపంచంలో బుల్లితెరపై ఓ సంచలనంగా మారడం వెనువెంటనే జరిగిపోయాయి. Also read : Jackfruit benefits: పనస పండుతో ప్రయోజనాలు.. మాంసాహారానికి మంచి ప్రత్యామ్నాయం