బాలీవుడ్ నటుడు నరేంద్ర ఝా తీవ్ర గుండెపోటుతో బుధవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 55 సంవత్సరాలు. ఏడాదిలో ఝాకు ఇది మూడవసారి గుండెపోటు రావడం అని నివేదికలు తెలిపాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీహార్ లోని మధుబని ప్రాంతంలో సెప్టెంబర్ 2న జన్మించిన ఝా, బాలీవుడ్ నటుడిగా, టెలివిజన్ నటుడిగా ప్రసిద్ధి చెందారు. 2002లో 'ఫంటూష్‌'  సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి ప్రవేశించారు.  


హృతిక్ రోషన్ మూవీ 'కాబిల్', షారుఖ్ ఖాన్ చిత్రం 'రాయిస్', షాహిద్ కపూర్ చిత్రం 'హైదర్' లో నరేంద్ర ఝా కీలక పాత్రలు పోషించారు.  మొహంజోదారో లాంటి సినిమాల్లో తనదైన శైలి నటనతో ఆకట్టుకున్నారు. కాగా.. సల్మాన్‌ఖాన్‌ హీరోగా బాలీవుడ్‌ అప్‌ కమింగ్‌ మూవీలో  'రేస్‌-3' ఆయన ఆఖరి చిత్రం.


దర్శకుడు అశోక్ పండిట్ నరేంద్ర ఝా మృతిపై విచారం వ్యక్తం చేశారు. మంచి స్నేహితుడిని కోల్పోయానని, అతని మరణవార్త షాక్ కు గురిచేసిందని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.