లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్ అనురాగ్ కశ్యప్‌ (Anurag Kashyap)కు మాజీ భార్య కల్కి కొచ్‌లిన్ మద్దతు తెలిపింది. తన భర్త ఏంటో తనకు బాగా తెలుసునని, విడాకులు తీసుకున్నంత మాత్రాన అనురాగ్ కశ్యప్‌కు వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదంటోంది నటి కల్కి కొచ్‌లిన్ (Kalki Koechlin). వివాహానికి ముందు నుంచి అనురాగ్ తనకు తెలుసునని, ఆయన ఎవరితో ఎలా నడుచుకుంటారు, ఆయన పద్ధతి తనకు తెలుసునని అనురాగ్‌కు మద్దతుగా నిలిచారు. 2011లో అనురాగ్‌ను వివాహం చేసుకున్న కల్కి.. 2015లో విభేదాల కారణంగా విడాకులు తీసుకుందని తెలిసిందే. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాగా, నటి పాయల్ ఘోష్ దర్శకుడు, నిర్మాత అనురాగ్ కశ్యప్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. సినిమా అవకాశాల కోసం అనురాగ్ వద్దకు వస్తే తన దుస్తులు విప్పబోయాడని, అవకాశం దొరికింది కదా అని తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తీవ్రమైన ఆరోపణలు చేసింది పాయల్. పాయల్ వ్యాఖ్యలతో మరోసారి బాలీవుడ్‌లో మీటూ (MeToo) చిచ్చు రేగింది. నెపోటిజమ్ (Nepotism)తో పాటు లైంగిక వేధింపుల ఆరోపణలు తరచుగా సినిమా ఇండస్ట్రీతో పాటు పలు రంగాలలో వినిపిస్తుంటాయి.  




‘నీపై ఆరోపణలు చేస్తుంటారు. వాటిని నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మహిళల స్వేచ్ఛ కోసం, వారికి దక్కాల్సిన సినిమాల కోసం పోరాడావు. వ్యక్తిగత జీవితంలోనూ మహిళలకు నువ్వు సాయం చేయడం నేను కళ్లారా చూశాను. నీపై ఆరోపనలు చేసిన వారిని వదిలెయ్. నీకోసం, నీ చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి మాత్రమే ఆలోచించాలని’ నటి కల్కి కొచ్‌లిన్ తన మాజీ భర్త అనురాగ్ కశ్యప్‌నకు మద్దతు తెలుపుతూ ట్వీట్ చేసింది.  Actor Vishals Chakra Movie: విశాల్‌కు మద్రాస్ హైకోర్టు రూ.8 కోట్ల షాక్!


ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe