Bank Loan Rejected: ‘హిందీ రాదా.. అయితే నీకు లోన్ ఇవ్వను’.. చివర్లో ట్విస్ట్!

‘హిందీ రాదా.. హిందీ మాట్లాడలేవా... అయితే నీకు లోన్ ఇవ్వలేను’ (Bank Loan Rejected For Not Knowing Hindi) అని బ్యాంకు మేనేజర్ చేసిన కామెంట్స్ దక్షిణాదిన కలకలం రేపుతున్నాయి. మరోవైపు మాకు హిందీ వద్దు అని ఉద్యమం నడుస్తోంది.

Last Updated : Sep 23, 2020, 12:03 PM IST
Bank Loan Rejected: ‘హిందీ రాదా.. అయితే నీకు లోన్ ఇవ్వను’.. చివర్లో ట్విస్ట్!

హిందీ రాదా.. హిందీ మాట్లాడలేవా... అయితే నీకు లోన్ ఇవ్వలేను’ (Bank Loan Rejected For Not Knowing Hindi) అని కామెంట్స్ చేసిన బ్యాంకు మేనేజర్‌పై బదిలీ వేటు పడింది. నిజమే దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ రాదని చెబితే కొందరు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో రిటైర్డ్ గవర్నమెంట్ డాక్టర్ సుబ్రమణియన్ (65) తనకు ఎదురైన చేదు ఘటనను వెలుగులోకి తెచ్చారు. మరోవైపు మాకు హిందీ వద్దు అని ఉద్యమం నడుస్తోంది.

ఆ వివరాలిలా ఉన్నాయి... తమిళనాడు (Tamil Nadu)లోని అరియలూరు జిల్లా గంగైకొండచోళపురం పట్టణానికి చెందిన సుబ్రమణియన్ ప్రభుత్వ వైద్యుడిగా సేవలందించి రిటైరయ్యారు. అయితే తాను ఓ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించేందుకు రుణం కోసం దరకఖాస్తు చేసుకున్నారు. తన మిత్రుడితో కలిసి ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకుకు వెళ్లగా 10 నిమిషాల పాటు నిల్చోబెట్టి మేనేజర్ విశాల్‌ నారయణన్‌ కాంబ్లే తమతో మాట్లాడారని, వయసులో పెద్ద అని కూర్చోవాలని కూడా చెప్పలేదన్నారు. 

బ్యాంకు మేనేజర్ తమిళనాడుకు చెందిన వ్యక్తి కాదు అని, ఆయనకు ఇంగ్లీషులో మాట్లాడటం ఇబ్బందిగా ఉందని హిందీ (Hindi Language)లో మాట్లాడాలని కోరినట్లు రిటైర్డ్ డాక్టర్ తెలిపారు. తనకు తమిళం, ఇంగ్లీష్ మాత్రమే వచ్చునని చెప్పగా.. అయితే నీకు హిందీ తెలియదా.. హిందీ రాకపోతే నేను లోన్ ఇవ్వలేనని (Bank Loan Rejected) బ్యాంకు మేనేజర్ ఖరాఖండిగా చెప్పేశాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లాయర్ ద్వారా నోటీసులు పంపినా బ్యాంక్ మేనేజర్ స్పందించలేదని మీడియాకు ఈ వివరాలు వివరించారు. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ సైతం దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు ఆ బ్యాంకు మేనేజర్‌నే వేరే ప్రాంతానికి బదిలీ చేశారు. Actor Vishals Chakra Movie: విశాల్‌కు మద్రాస్ హైకోర్టు రూ.8 కోట్ల షాక్!

ఫొటో గ్యాలరీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News