విప్లవ యోధుడు చేగువేరా కూతురు డా. అలైదా గువేరా చేతుల మీదుగా `చే` మూవీ పోస్టర్ లాంచ్
క్యూబా పోరాటయోధుడు చేగువేరా జీవిత చరిత్ర ఆధారంగా తొలిసారి తెలుగులో సినిమా రూపొందుతుంది. క్యూబా తరువాత ప్రపంచం లో తొలిసారి రూపొందుతున్న చేగువేరా బియోపిక్ లో.. బి.ఆర్ సభావత్ నాయక్ టైటిల్ రోల్ పోషిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. ఆ వివరాలు
'Che' Movie Poster: తెలుగు తెరపై మరో బయోపిక్ రాబోతుంది. క్యూబా పోరాటయోధుడు చేగువేరా జీవిత చరిత్ర ఆధారంగా రూపోందుతున్న చిత్రం "చే" లాంగ్ లైవ్ ట్యాగ్ లైన్. క్యూబా తరువాత ప్రపంచం లో తొలిసారి రూపొందుతున్న చేగువేరా బియోపిక్ ఇది. నవ ఉదయం సమర్పణలో నేచర్ ఆర్ట్స్ బ్యానర్ పై బి.ఆర్ సభావత్ నాయక్ టైటిల్ రోల్ పోషిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. సూర్య, బాబు, దేవేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్ , పసల ఉమా మహేశ్వర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. రవిశంకర్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ పోస్టర్ ను చేగువేరా కూతురు డాక్టర్ అలైదా గువేరా లాంచ్ చేసి చిత్రయూనిట్ ను అభినందించారు..
అనంతరం హీరో , దర్శకుడు బి.ఆర్ సభావత్ నాయక్ మాట్లాడుతూ... "విప్లవ వీరుడు , యువత స్పూర్తిదాయకుడు చేగువేరా జీవిత చరిత్రను సినిమా గా తీయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము.. ఆయన చేసిన పోరాటలు, త్యాగాలు ఈ చిత్రంలో తీశాము. అప్పటి పరిస్థితులకు అద్దం పట్టే విధంగా చాలా జాగ్రత్తలు తీసుకుని, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా ను రూపోందించాం" అని చెప్పారు. "ఈ మూవీ పోస్టర్ ను చేగువేరా కూతురు డా.అలైదా గువేరా విడుదల చేయ్యడం అదృష్టంగా భావిస్తున్నాం. పోస్ట్ ప్రోడక్షన్ పూర్తికాగానే..త్వరలో సినిమా టీజర్ ,ట్రైలర్ రిలీజ్ చేసి విడుదల తేదిని అనౌన్స్ చేస్తాం" అని తెలిపారు..
నటీనటులు లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్, పసల ఉమామహేశ్వర్, బి.ఆర్ సభావత్ నాయక్..
Also Read: Baby OTT Release Date: బేబీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
నిర్మాతలు : సూర్య , బాబు , దేవేంద్ర
కో డైరెక్టర్ : నాని బాబు
రచయిత, దర్శకుడు : బి.ఆర్ సభావత్ నాయక్
బ్యానర్ : నేచర్ ఆర్ట్స్
పబ్లిసిటి డిజైనర్ : వివ రెడ్డి పోస్టర్స్
డి.ఓ.పి : జగదీష్
ఎడిటర్ : శివ శర్వాణి
సంగీత దర్శకుడు : రవిశంకర్
పి.ఆర్.ఓ : దయ్యాల అశోక్
Also Read: Shilpa Shetty: చెప్పులు ధరించి జాతీయ జెండాను ఎగురవేసిన శిల్పాశెట్టి.. నెట్టింట ట్రోలింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి