Comedian Pruthviraj was admitted to hospital: తెలుగు సినీ ఇండస్ట్రీలో.. థర్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ అనే డైలాగ్‌‌తో కమెడియన్ పృథ్వీరాజ్ ( Pruthvi Raj ) ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు. ఎన్నో సినిమాల్లో మంచి క్యారెక్టర్లు చేసి పృథ్వీరాజ్ మంచి కమెడియన్‌గా, నటుడిగా గుర్తింపు పొందారు. అయితే తాజాగా ఆయన అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరిన ఆయ‌న తాజాగా ఒక వీడియోను విడుద‌ల చేశారు. ఇందులో అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న‌ట్టు ఆయన పేర్కొన్నారు. అందరి ఆశీర్వాదంతోపాటు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం త‌న‌కి కావాల‌ని ఆయన ఈ వీడియోలో కోరారు. Also read: RGV Murder song: పిల్లల్ని ప్రేమించడం తప్పా..?


గ‌త ప‌ది రోజులుగా జ‌లుబుతో తీవ్రంగా బాధ‌ప‌డుతున్నానని, రెండు సార్లు క‌రోనావైరస్ ( Coronavirus ) పరీక్షలు చేయించినప్ప‌టికీ నెగెటివ్ వ‌చ్చింద‌ని పృథ్వీరాజ్ అన్నారు. టెస్టుల్లో నెగెటివ్ వచ్చినప్పటికీ 15 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాల‌ని డాక్ట‌ర్లు చెప్ప‌డంతో నిన్న అర్ధ‌రాత్రి ఆసుప‌త్రిలో చేరిన‌ట్టు వీడియోలో చెప్పారు. అయితే పృథ్వీరాజ్ కమెడియన్‌గా రాణిస్తూనే.. ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్ఆర్ సీపీలో నేతగా ఎదిగారు. కొంతకాలం క్రితం ఎస్వీబీసీ చైర్మన్‌గా బాధ్య‌త‌లు చేపట్టి ఉద్యోగులతో అమర్యాదగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోప‌ణ‌లతో పదవికి రాజీనామా చేశారు.  Also read: Covid-19: దేశంలో నానాటికి పెరుగుతున్న కరోనా కేసులు