అభిషేక్ - ఐశ్వర్యలను ఉద్దేశించి ఓ నెటిజెన్ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. అందమైన భార్యను పొందే అర్హత అభిషేక్ కు ఉందా ? అని ప్రశ్నించాడు. ఈ ట్వీట్ చూసిన అభిషేక్ భగ్గుమన్నాడు. నెటిజన్ కు ఘాటుగా రిప్లై ఇచ్చాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళ్లినట్లయితే ట్విట్టర్ వేదికగా ఓ నెటిజన్ ఏమని ట్వీట్ చేశాడంటే..  తల్లితండ్రుల ప్రజాదరణను వాడుకొని పైకి ఎదిగిన వారు అందమైన భార్యను పొందారని కామెంట్ చేశాడు. అంతటితో ఆగకుండా అర్హులు కాని వారికి అందమైన భార్యలు వచ్చారని అభిషేక్ ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ ట్వీట్ బాబి డియోల్ పేరుతో ఉన్న నకిలీ ఐడీతో రావడం గమనార్హం.



అభిషేక్ ఘాటైన రిప్లై ...


తాజా ట్వీట్ పై అభిషేక్ బచ్చన్ ఘాటుగా బదులిచ్చాడు. బ్రదర్.. నా అడుగు జాడల్లో ఒక మైలు దూరం ప్రయాణించు. నా దారిలో కనీసం పది అడుగులు ప్రయాణించినా చాలు నేను ప్రభావితమవుతాను. పక్క వారి గురించి కంటే ముందు నీ  గురించి నువ్వు ఆలోచించుకో. నిన్ను నువ్వు మెరుగు పరచుకోవడం కోసం సమయం వెచ్చించు. ఆ దేవుడికి తెలుసు ఎవరి ప్రయాణం వారిదేనని. తొందరగా నువ్వు కోలుకోవాలని కోరుకుంటున్నా అని అభిషేక్ బచ్చన్ తనదైన శైలిలో  బదులిచ్చాడు.



నెటిజన్ ప్రతిస్పందన...


అభిషేక్ ఇచ్చిక కౌంటర్ కు ప్రతిస్పందించాడు ఆ నెటిజన్. తనను తాను సమర్థించుకుంటూ మరో ట్వీట్ చేశాడు..సరదాకే ఆ ట్వీట్ చేశా.  ప్రశాంతమైన మీరు  వ్యక్తుల్లో మీరు ఒకరు. థియేటర్లో మీ సినిమా ఆడకపోయినా... మీరు ధరించే  సూట్స్ లో బాగుంటారు.  ఆ ట్వీట్ కేవలం జోక్ మాత్రమే. మీ మనసు నొప్పించి ఉంటే క్షమాపణలు చెబుతున్నా అని సదరు నెటిజన్ అన్నాడు