లాక్ డౌన్ వేళ మరో విచిత్రం.. ఆశ్చర్యానికి గురిచేసిన పెళ్లి.. వైరల్ అయిన వీడియో..
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత కొనసాగుతుండటంతో వ్యాప్తి కట్టడి దిశగా కేంద్రప్రభుత్వం మరోసారి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితం కాగా చాలా కార్యక్రమాలు వాయిదా పడ్డాయి.
ముంబై: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత కొనసాగుతుండటంతో వ్యాప్తి కట్టడి దిశగా కేంద్రప్రభుత్వం మరోసారి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితం కాగా చాలా కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. వివాహాది ఇతర శుభకార్యాలు కూడా నిలిచిపోయాయి. పరిమితమైన సంఖ్యలో మాత్రమే కార్యాలకు హాజరు కావడం ఒకవేళ పెట్టిన ముహూర్తానికి పెళ్లి చేయాలని అనుకున్న వాళ్లు మాత్రం కేవలం ముఖ్యమైన వారు ఏడుగురు, పదిమందితోనే పెళ్లి పూర్తి చేస్తున్నారు.
మరోవైపు రవాణా ఇబ్బందులు ఉన్నవారు ఆన్‌లైన్‌లోనే తాళి కట్టేస్తున్నారు. అయితే ఔరంగబాద్ లోనూ లాక్‌డౌన్ సమయంలో ఓ విచిత్ర వివాహం జరిగింది. వివరాల్లోకి వెళితే ఔరంగబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుక అందరినీ ఆకట్టుకుంది. కరోనా, లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని అధికారులు సూచిస్తుండగా, అందుకు అనుగుణంగా పెళ్లి చేసుకుంది ఓ జంట. లాక్‌డౌన్ నిబంధనలు కఠినంగా పాటించిన ఆ వధూవరులు కర్రల సాయంతో దండలు మార్చుకుని అందరి ఆశ్చర్యానికి గురిచేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..