Dear Uma: శ్రీవారి ఆలయానికి హీరోయిన్ సుమయా రెడ్డి విరాళం.. త్వరలో `డియర్ ఉమ`తో ఆడియన్స్ ముందుకు..!
Dear Uma Movie Latest Updates: డియర్ ఉమ మూవీతో త్వరలోనే ఆడియన్స్‌ను పలకరించనుంది హీరోయిన్ సుమయా రెడ్డి. ఆమె నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు రాజేష్ మహాదేవ్ దర్శకత్వం వహిస్తున్నారు. సింహాద్రి పురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఆమె.. రూ.1.7 లక్షలు విరాళంగా అందజేశారు.
Dear Uma Movie Latest Updates: ‘డియర్ ఉమ’ సినిమాతో నిర్మాత, హీరోయిన్‌గా తెరపైకి రాబోతున్నారు సుమయా రెడ్డి. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పనుల్ని పూర్తి చేశారు. ఈ మధ్యే సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది. ఇక త్వరలోనే సుమయ రెడ్డి తన బహు ముఖ ప్రజ్ఞతో అందరినీ ఆకట్టుకోనున్నారు. సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్ మీద డియర్ ఉమ అనే మూవీ త్వరలోనే ఆడియన్స్‌ను పలకరించనుంది.
‘డియర్ ఉమ’ చిత్రంలో సుమయ రెడ్డి, దియా మూవీ ఫేమ్ పృథ్వీ అంబర్ జంటగా నటిస్తున్నారు. ఈ మూవీకి సుమయ రెడ్డి నిర్మాతగా.. నగేష్ లైన్ ప్రొడ్యూసర్‌గా, నితిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్వవహరిస్తున్నారు. ఈ సినిమాకు సాయి రాజేష్ మహాదేవ్ దర్శకత్వం వహిస్తున్నారు. స్క్రీన్ ప్లేతోపాటు మాటలు కూడా ఆయనే రాశారు.
Also Read: Pawan Kalyan: జాబితాలో పవన్ కళ్యాణ్ పేరెందుకు లేదు, పోటీ చేయడం లేదా
తాజాగా సుమయా రెడ్డి సింహాద్రి పురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆమె గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడారు. ‘డియర్ ఉమ సినిమాతో తొలిసారిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. ప్రేమ కథా చిత్రంగా రాబోతున్న ఈ మూవీ టీజర్‌ను ఇటీవలె విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. మే నెలలో సినిమాను విడుదల చేయబోతున్నాం’ అని అన్నారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి తనవంతుగా రూ.1.7 లక్షలు విరాళంగా ఇచ్చారు.
డియర్ ఉమ చిత్రానికి రధన్ సంగీతం అందించారు. కెమెరామెన్‌గా రాజ్ తోట వ్యవహరించగా.. కమల్ కామరాజు, సప్త గిరి, అజయ్ ఘోష్, ఆమని, రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, రూప లక్ష్మీ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.
సాంకేతిక బృందం
==> బ్యానర్: సుమ చిత్ర ఆర్ట్స్
==> ప్రొడ్యూసర్: సుమయ రెడ్డి
==> డైరెక్టర్: సాయి రాజేష్ మహాదేవ్
==> సినిమాటోగ్రఫర్ : రాజ్ తోట
==> మ్యూజిక్: రధన్
==> ఎడిటర్: సత్య గిడుతూరి
==> PRO: సాయి సతీష్
Also Read: Chandrababu Case: క్వాష్ కొట్టివేత, ద్విసభ్య ధర్మాసనంలో ఎవరేమన్నారంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter