Dear Uma Movie Updates: తెలుగమ్మాయి హీరోయిన్‌గా, నిర్మాతగా మారి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం అంటే సాధారణమైన విషయం కాదు. ‘డియర్ ఉమ’ సినిమాతో నిర్మాత, హీరోయిన్‌గా తెరపైకి రాబోతున్నారు సుమయా రెడ్డి. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పనుల్ని పూర్తి చేశారు. ఈ మధ్యే సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది. సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్ మీద డియర్ ఉమ అనే చిత్రం త్వరలోనే రాబోతోంది. అయితే ఈ క్రమంలో సుమయా రెడ్డి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. దేవాలయాలకు విరాళం ఇస్తున్నారు. తాజాగా సుమయా రెడ్డి తిరుమలలో ప్రత్యక్షమయ్యారు. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Tulasi plant: తులసిమొక్క వద్ద పొరపాటున కూడా ఈ 5 పెట్టకండి.. ఆ ఇంట ఎప్పుడూ ఆర్థికసమస్యలేనట..  


‘డియర్ ఉమ’ చిత్రంలో సుమయ రెడ్డి, దియా మూవి ఫేమ్ పృథ్వీ అంబర్ జంటగా నటించారు. ఈ మూవీని సుమయ రెడ్డి నిర్మించగా.. సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు చూసుకుంటున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.


ఇటీవలె సుమయా రెడ్డి సింహాద్రి పురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న విషయం తెలిసిందే. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ‘డియర్ ఉమ సినిమాతో తొలిసారిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నానని చెప్పారు. మే నెలలో సినిమాను విడుదల చేయబోతున్నామని ఆమె ప్రకటించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి తనవంతుగా రూ.1.7 లక్షలు విరాళంగా అందజేశారు.


డియర్ ఉమ మూవీకి రధన్ మ్యూజిక్ అందించారు. కెమెరామెన్‌గా రాజ్ తోట పనిచేశారు. కమల్ కామరాజు, సప్త గిరి, అజయ్ ఘోష్, ఆమని, రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, రూప లక్ష్మీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి సుమయ రెడ్డి నిర్మాతగా.. నగేష్ లైన్ ప్రొడ్యూసర్‌గా, నితిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యహరిస్తున్నారు. 


Also Read: Broom Vastu: వాస్తు ప్రకారం చీపురు ఈ దిశలో పెట్టారంటే అష్టదరిద్రం తప్పదు..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter