డియర్ జిందగీ: ఎన్ని ప్రశంసలు కావాలి బాస్ నీకు..!
మానవీయ విలువలు, స్నేహం అనే అంశాలు లోపించడం వల్ల మనం కేవలం ఇతరుల ప్రశంసల కోసమే వేచి చూస్తుంటాం. విమర్శలతో పాటు చేదు నిజాలను అంగీకరించడానికి కూడా వెనుకాడతాం. అయితే ఇలాంటి గుణగణాల వల్ల జీవితానికి కలిగే లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
దయాశంకర్ మిశ్రా, డిజిటల్ ఎడిటర్, జీ న్యూస్ హిందీ
మానవీయ విలువలు, స్నేహం అనే అంశాలు లోపించడం వల్ల మనం కేవలం ఇతరుల ప్రశంసల కోసమే వేచి చూస్తుంటాం. విమర్శలతో పాటు చేదు నిజాలను అంగీకరించడానికి కూడా వెనుకాడతాం. అయితే ఇలాంటి గుణగణాల వల్ల జీవితానికి కలిగే లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ప్రశంస అనే నీటిలో ఈదడానికి ప్రయత్నించేవారు... అందులో మునిగి తేలకపోతే చాలు.. తామేదో అంతరించిపోయే జీవుల గుంపులో చేరుతున్నట్లు ఫీలవుతుంటారు. అందుకే మనం ముందు మనల్ని పొగిడే వారి పట్ల జాగరూపులై ఉండాలి. ఇతరుల పొగడ్తల కన్నా మన క్రమశిక్షణే ముఖ్యమనే విషయాన్ని మనం గుర్తించాలి. మనసును, మెదడును నియంత్రణలో పెట్టుకోవాలి. .
ప్రశంస లేదా ముఖస్తుతి మధ్య కూడా తేడా ఉంది. నిజంగానే మనిషిలో ప్రేరణను నింపడానికి అందించే ప్రశంస వల్ల కలిగే లాభం.. ముఖస్తుతి వలన కలగదు. ముఖస్తుతి వల్ల ప్రశంస కూడా వికృతరూపాన్ని సంతరించుకుంటుంది. ఇలాంటి ముఖస్తుతి వల్ల మీ లక్ష్యాలు సాధించడానికి మీరు ఏర్పరచుకున్న గమ్యాలు తిరోగమనం వైపు పయనించే అవకాశం ఉంది. మీ మనోబలం అహంకారానికి దాసోహమై మనోవికారంగా మారే ప్రమాదమూ ఉంది. కొందరు ఇతరులను ప్రసన్నం చేసుకోవడం కోసం తమ సంపూర్ణ శక్తితో పాటు యోగ్యతను, ఆలోచనలను కూడా పణంగా పెడతారు. అందుకోసం ప్రశంసించడాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటారు.
అదే విధంగా మానవీయ విలువలు, సున్నితమైన మనసు లేనివారు మాత్రం అర్హత లేకపోయినా ఇతరుల ప్రశంసలు కోరుకుంటూ ఉంటారు. విమర్శించేవారిని, తమ తప్పొప్పులను చూపెట్టేవారిని దూరం పెడుతూ ఉంటారు. అయితే ఇలా అర్హత లేకుండా ప్రశంసలు పొందడం వల్ల జీవితానికి కలిగే నష్టాన్ని అంచనా వేయలేకపోతుంటారు.
అందుకే కొందరు ప్రశంసల మాయాజాలంలో పడడం వల్ల తమకు ఇష్టం లేని విషయాలపై అక్కసును, ఇష్టపడే విషయాలపై విపరీతమైన ఆపేక్షను పెంచుకుంటారు. క్రమక్రమంగా ఇలాంటి ఆలోచనలు కలిగిన వారు తమ మాటలు ఇతరులకి నచ్చకపోతే వారిని ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయత్నిస్తుంటారు. తమ మాటలను అంగీకరించని వారిని శక్తిమంతులుగా భావిస్తూ.. వారి పట్ల ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటారు.
"సోషల్ మీడియా" వచ్చాక విమర్శల పర్వం కొత్త రూపం దాల్చింది. తమకు నచ్చని వ్యక్తులను బహిరంగంగా విమర్శించేందుకు చాలామంది వెనుకాడడం లేదు. ఇలాంటి సమయాల్లో ప్రశంసల్లో మునిగితేలేవారు విమర్శలను తీసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. మనసును అల్లకల్లోలం చేసుకుంటున్నారు. "ప్రశంస" అనే అంశంపై నేను ఈ వ్యాసాన్ని రాస్తున్నప్పుడు అనేక ఆలోచనలు వచ్చాయి. అలాంటి సమయంలోనే ఓ కథ గుర్తొచ్చింది. మీరు కూడా ఒక్క క్షణం సమయం కేటాయించి ఆ కథ చదివేయండి
ఈ కథ పేరు "కీర్తి-రక్ష"..
ఈ కథ ఓ పూర్వజన్మకి సంబంధించింది. ఈ కథలో కథానాయకుడు ఓ రాజ్యాన్ని పాలిస్తున్న ఓ లోకప్రియ పాలకుడు. అతని దేశవాసులకు అతనంటే ఎంతో గౌరవం. అతని దేశస్థులు అతని వీరత్వం గురించి ఎప్పుడూ పొగుడుతూ ఉండేవారు. వారికి పాలకుడి కోసం అత్యంత ఎత్తైన ప్రతిమను, కీర్తి స్తంబాన్ని ప్రతిష్టించాలనే కోరిక ఉండేది. పాలకుడి మరణం తర్వాత.. ఆయన తనను పరలోకానికి తీసుకెళ్తున్న దేవదూతతో తన మనసులోని కోరికను చెప్పాడు. తన కోసం అతని దేశవాసులు కట్టిన ప్రతిమను, స్తంబాన్ని చూడాలని ఉందని కోరాడు. దేవదూత అతని కోరికను మన్నించి అతని ప్రతిమ వద్దకు తీసుకెళ్లాడు.
ఆ ప్రతిమ ఓ అడవిలో ఉంది. ఆ ప్రతిమ పక్కనే ఓ కీర్తి స్తంబం కూడా ఉంది. దాని మీద ఏదో రాసి ఉంది. దేవదూత సహాయంతో అక్కడికి వెళ్లిన పాలకుడు ఆ స్తంబంపై ఉన్న వాక్యాలు చదివాడు. "ఈ స్తంబం మా కులానికి చెందిన అతి గొప్ప పాలకుడిది. చిన్నవాడిగా ఉన్నప్పుడే మూడు అడుగుల ఎత్తున్న బావిలో దూకి తన వీరత్వాన్ని చాటుకున్న సందర్భంగా ఆయనను మా పూర్వీకులు రాజుగా ఎన్నుకున్నారు. అందుకే అదే బావిలో నుండి వచ్చిన లోహంతో ఈ కీర్తి స్తంబాన్ని మేము నిర్మించాము" అని రాసి ఉంది.
ఆ వాక్యాలు చదవగానే రాజుకి తలకొట్టేసినట్లైంది. బతికున్నప్పుడు తను చేసిన యుద్ధాలను, చేసిన సాహస యాత్రలను పొగిడిన జనులు, మరణించాక కనీసం వాటి ప్రస్తావన కూడా తీసుకురాకుండా ఎప్పుడో చిన్నప్పుడు చేసిని చిలిపి పనిని వీరత్వానికి ప్రతీకగా చూపించడంతో తన మీద వారికి ఎలాంటి అభిప్రాయం ఉందో అర్థమైంది. తాను సాధించిన విజయాలన్నీ నిరుపయోగమయ్యాయి కదా.. వాటిని కీర్తి స్తంబంపై ప్రస్తావిస్తే బాగుండేది కదా అని ఆయన బాధపడ్డాడు.
బతికున్నప్పుడు తనను ఎంతగానో ప్రశంసించిన ప్రజలు.. మరణించాక తన విజయాలను పొగడకపోవడంతో నొచ్చుకున్న రాజు, వెంటనే దేవదూత సహాయంతో అక్కడి నుండి వెంటనే వెళ్లిపోయాడు . ఆ సంఘటన ఆ రాజుకి తదుపరి జన్మలో కూడా గుర్తుంది. అందుకే ఎవరైనా తన ఎక్కువగా పొగిడినా.. ప్రశంసించినా తన పూర్వ జన్మ కథ ఆయనకు టక్కన గుర్తుకువచ్చేది. ఆయన వెంటనే అప్రమత్తమయ్యేవాడు. పొగడ్తలకు లొంగకూడదు అని భావించేవాడు..
అంతటితో కథ ముగుస్తుంది.
మరి మీరు కూడా మిమ్మల్ని ఎవరైనా అతిగా పొగిడినా.. ప్రశంసించినా ఈ కథను ఓ సారి గుర్తుచేసుకోండి .
బహుశా.. మీకు ఆ కథ సహాయపడవచ్చు.
ఈ ఆర్టికల్‌ని హిందీలో చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి :- डियर जिंदगी : कितनी तारीफें चाहिए!
(https://twitter.com/dayashankarmi)
(ఈ ఆర్టికల్‌పై మీ సలహాలు, సూచనలు తెలియచేయండి: https://www.facebook.com/dayashankar.mishra.54)