Dil Raju Fires on Media and Social Media: కార్తికేయ 2 సినిమా అనేకసార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు ఆగస్టు 13వ తేదీ విడుదలై అద్భుతమైన టాక్ తెచ్చుకోవడమే గాక మంచి కలెక్షన్ల వర్షం కూడా కురుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా అనేకసార్లు వాయిదా పడటానికి దిల్ రాసే కారణమని ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. దిల్ రాజు మా సినిమా సాఫీగా విడుదల కావడానికి కారణం అయ్యారు, ఆయన మా సినిమా ఆపలేదు అని నిఖిల్ ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో మాత్రం ఎక్కువగా దిల్ రాజు పేరే ప్రస్తావిస్తూ వచ్చారు. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొన్న దిల్ రాజు కాస్త ఎమోషనల్ అవుతూనే ఆవేశానికి కూడా లోనయ్యారు. ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిన విషయంలో తన పాత్ర ఉందంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదని దిల్ రాజు చెప్పుకొచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీ ఇష్టానికి రాసేస్తున్నారు, అసలు సినిమా పరిశ్రమలో సినిమాను తొక్కేయాలని ఆలోచన ఉండదని ఆయన అన్నారు. ఒక సినిమా విడుదలయ్యి సూపర్ హిట్ గా నిలిచిందంటే సినిమా పరిశ్రమలో ఉన్న వారందరూ ఆనందపడతారని ఆ సినిమా హిట్ అయితే మాకు మరిన్ని సినిమాలు తీయడానికి ఊతం ఇచ్చినట్లు అవుతుందని చెప్పకొచ్చారు. అంతేకాక కార్తికేయ 2 విడుదల వాయిదా ఎలా పడిందనే విషయం మీద కూడా దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. నిజానికి జూలై 5 సమయంలో థాంక్యూ సినిమా విడుదల చేయాలనుకున్నామని కానీ అప్పటికి సినిమా పూర్తి కాకపోవడంతో జూలై 22వ తేదీ విడుదల చేయడానికి ప్లాన్ చేశామని అన్నారు. అప్పటికే కార్తికేయ టీం సినిమా విడుదలకు డేట్ ప్రకటించడంతో మేము కూడా విడుదల చేయాలనుకుంటున్నాము ఏం చేద్దాము అని వివేక్ కూచిభొట్లని అడిగితే ఆయన హీరో, డైరెక్టర్ తో మాట్లాడి చెబుతానన్నారని, ఆ తర్వాత తన ఇంటికి వచ్చిన నిఖిల్, చందూ మొండేటి 22వ తేదీ నుంచి తమ చిత్రాన్ని వేరే డేట్ కు మార్చుకోవడానికి అంగీకరించారని, వారికి తాను ఎప్పుడు విడుదలకు వచ్చినా నా తరఫున సహకరిస్తానని మాట ఇచ్చానని అన్నారు.


ఆగస్టు 5వ తేదీన సినిమా విడుదల చేద్దామనుకుంటున్నామని చెబితే అప్పటికే బింబిసార సీతారామం సినిమాలకు మంచి టాక్ వస్తుందని ఆ రెండు సినిమాలు విడుదల చేసినప్పుడు మన సినిమా విడుదల చేస్తే ఇబ్బంది పడతారని చెప్పడంతో ఆగస్టు 12వ తేదీ విడుదల చేయడానికి సిద్ధమయ్యారని చెప్పుకొచ్చారు. అయితే అప్పటికే కొన్ని సినిమాలు ప్రకటించడంతో మళ్లీ ఆలోచిస్తున్న సమయంలో కోబ్రా సినిమా వెనక్కి వెళుతూ ఉండడంతో తాము విడుదల చేయడానికి సిద్ధమయ్యారని అయితే నితిన్ సినిమా కూడా అదే రోజు విడుదలవుతూ ఉండడంతో కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయనే ఉద్దేశంతో డిస్ట్రిబ్యూటర్ల సలహా మేరకు ఒకరోజు వెనక్కి వెళ్లి 13న  థియేటర్లో విడుదలైందని విడుదలైన తర్వాత మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి సూపర్ హిట్గా నిలిచిందని అన్నారు. ఈ సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా… ఓ సినిమా హిట్ అయితే మొదట సంతోషించేది తానేనని, ఇక్కడ అసలు ఎవరూ ఎవరి సినిమా తొక్కేయాలని చూడరని దిల్ రాజు చెప్పుకొచ్చారు.


ఇక ‘బింబిసార’ నైజాంలో వీకెండ్లో ఐదు కోట్లు వసూలు చేస్తే ‘కార్తికేయ -2’ రెండు హిందీ సినిమాలు, మూడు తెలుగు సినిమాల పోటీ ఉండగా తక్కువ థియేటర్లతోనే 4 కోట్లు సాధించిందని, ఏ సినిమా విజయాన్ని ఎవరూ ఆపలేరనడానికి ఇదే ఉదాహరణ అని ఆయన చెప్పుకొచ్చారు. ఇలాంటివి రాసేవారు, వినేవారు, చదివేవారు కాస్తంత కామన్ సెన్స్ ఉపయోగిస్తే బాగుంటుంది అని దిల్ రాజు పేర్కొన్నారు. కానీ ఈ విషయంలో ఏం జరిగిందో తెలుసుకోకుండా దిల్ రాజు ఏదో చేస్తున్నాడు అంటూ మీ క్లిక్స్ కోసం మీ సబ్స్క్రైబర్స్ కోసం తనను బద్నాం చేయడం కరెక్ట్ కాదని ఆయన చెప్పుకొచ్చారు. దిల్ రాజు ఎలాంటి వాడో సినీ పరిశ్రమలో అందరికీ తెలుసని, ఏదైనా ఉంటే తనను అడిగి క్లారిటీ తీసుకుని రాయాలి కానీ ఇష్టం వచ్చినట్లు రాస్తే ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పుకొచ్చారు.


ఇలాంటి విషయాల మీద నువ్వు మాట్లాడవద్దు అని పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారని అందుకే తాను పెద్దగా రెస్పాండ్ అయ్యే వాడిని కాదని దిల్ రాజు చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు మాత్రం తాను ఉండబట్టలేక మాట్లాడేస్తున్నానని అన్నారు. ఇక తనకు నిఖిల్, చందు అలాగే నిర్మాత వివేక్ కూచిబోట్లతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అంతేకాక ఈ రోజు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి సంబంధించిన ఎనిమిది సినిమాలు ప్రొడక్షన్ దశలో ఉన్నాయని టాలీవుడ్లోనే టాప్ స్థాయిలో దూసుకుపోతున్న ఆ నిర్మాణ సంస్థకు సంబంధించిన సినిమాను ఎవరైనా తొక్కుతారా? అని ప్రశ్నించారు. అంతేకాక సినిమాలను నేను తొక్కేస్తున్నాను అని అనడం కరెక్ట్ కాదని చెప్పుకొచ్చారు.


Also Read: Rape Case on Singer Rahul Jain: బాలీవుడ్ సింగర్ పై రేప్ కేసు.. అలా పిలిచి అఘాయిత్యం చేశాడు అంటూ!


Also Read: Karthikeya 2 Collection: సత్తా చాటిన కార్తికేయ 2.. మూడో రోజు సంచలనం.. బ్రేక్ ఈవెన్ ఫినిష్ చేసి కోట్లలో లాభాలు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి