సోషల్ మీడియాలో యమ యాక్టీవ్ గా ఉండే దర్శకుల్లో రామ్ గోపాల్ వర్మ ఒకరు. ఎప్పుడూ రాత్రుళ్లు ట్వీట్ చేసే ఈ దర్శకుడు ఈసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకపై తనదైన రీతిలో వ్యాఖ్యలు చేశారు. ఆ పోస్ట్ ఏంటో మీరే చూడండి. 


"నాకు రాజకీయాలపై అవగాహన లేదు. ఈనెల 28వ తేదీన హైదరాబాద్ లో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సుకు ఇవాంక ఎందుకు వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. అయితే, ఆమె అందాన్ని చూడటానికి నేను ఎదురుచూస్తున్నాను. భారత్ కు సన్నీలియోన్ వచ్చినప్పుడు నేను ఎంతగా ఎగ్జాయిట్ అయ్యానో.. ఇప్పుడూ అంతే ఎగ్జాయిట్ గా ఉన్నా' అని  సోషల్ మీడియాలో పోస్టు చేసాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకను సన్నీలియోన్ తో పోలుస్తూ చేసిన ఈ పోస్ట్ వైరలయ్యింది. కాగా, ఇవాంక  నవంబర్ 28న హైదరాబాద్ లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ తో కలిసి ప్రారంభించనున్నారు. ఆమె వస్తున్న సందర్భంగా హైదరాబాద్లో బిచ్చగాళ్లు కనిపించనీయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకున్న సగంతి తెలిసిందే..!