Kaliyugam Pattanamlo: ‘కలియుగం పట్టణంలో’ నుంచి `జో జో లాలీ అమ్మ` సాంగ్ రిలీజ్
Jo Jo Lali Amma Lyrical Song: కలియుగ పట్టణం మూవీ రిలీజ్‌కు సిద్ధమైంది. మార్చి 22న ఆడియన్స్ ముందుకు రానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. తాజాగా సినిమా నుంచి `జో జో లాలీ అమ్మ` అంటూ సాగే సాంగ్‌ను ప్రముఖ దర్శకుడు వశిష్ట విడుదల చేశారు.
Jo Jo Lali Amma Lyrical Song: టాలీవుడ్‌లో ప్రస్తుతం న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్ కనిపిస్తోంది. కొత్తగా వస్తున్న టీమ్ విభిన్న కథలతో ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోంది. కొత్త దర్శక నిర్మాతలు, హీరోలు డిఫరెంట్ కాన్సెప్ట్‌లను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తిక్, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘కలియుగం పట్టణంలో’ అనే ఓ డిఫరెంట్ మూవీ రాబోతోంది. ఈ మూవీకి రమాకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌లు కలిసి సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. మార్చి 22న రాబోతోన్న ఈ మూవీలో చిత్రా శుక్లా ప్రధాన పాత్రను పోషిస్తున్నారు.
Also Read: SIP Investment: నెలకు 1000 రూపాయలు పెట్టుబడితో 1-2 కోట్లు సంపాదించడం ఎలా
టాలీవుడ్‌లో ఇది వరకు ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమాలు రాలేదని మేకర్స్ చెబుతున్నారు. సరికొత్త పాయింట్‌తో సినిమాను రూపొందించామని.. మంచి సందేశాన్ని ఇస్తూ కుటుంబ సమేతంగా అలరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రీసెంట్‌గా విడుదల చేసిన మూవీ రిలీజ్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా 'జో జో లాలీ అమ్మ' సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సాంగ్‌తో మూవీలో మదర్ సెంటిమెంట్ ఉంటుందని చెప్పేశారు మేకర్స్. ఈ పాటను ప్రముఖ దర్శకుడు వశిష్ట రిలీజ్ చేశారు. పాట చాలా బాగుందని చిత్రయూనిట్‌ను అభినందించారు. సినిమా పెద్ద హిట్ అవ్వాలని యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.
భాస్కరభట్ల రాసిన సాహిత్యం, అనురాగ్ కులకర్ణి గాత్రం, అజయ్ అరసాద వినసొంపైన బాణీ ఇలా అన్నీ కలిపి మరో ట్రెండ్ సెట్టర్ లాలి పాట వచ్చినట్టుగానే అనిపిస్తుంది. 45 రోజుల వ్యవధిలో కడప జిల్లాలోనే ఈ మూవీ షూటింగ్ పార్ట్‌ను కంప్లీట్ చేశారు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నారు. ఈ సినిమా ఎడిటర్‌గా గ్యారీ బీహెచ్ పనిచేస్తున్నారు. అజయ్ అరసాద మ్యూజిక్ అందించగా.. ఆస్కార్ అవార్డ్ గ్రహీత చంద్రబోస్, భాస్కర భట్ల వంటి వారు పాటలకు సాహిత్యాన్ని అందించారు. కెమెరామెన్‌గా చరణ్ మాధవనేని వర్క్ చేశారు.
నటీనటులు: విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్, చిత్రా శుక్లా తదితరులు
సాంకేతిక బృందం
==> బ్యానర్ : నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్
==> ప్రొడ్యూసర్స్: డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్
==> డైరెక్టర్ : రమాకాంత్ రెడ్డి
==> మ్యూజిక్ డైరెక్టర్: అజయ్ అరసాద
==> కెమెరామెన్ : చరణ్ మాధవనేని
==> సాహిత్యం : చంద్రబోస్, భాస్కర భట్ల
==> ఎడిటర్ : గ్యారీ బీహెచ్
==> ఆర్ట్ డైరెక్టర్ : రవి
==> స్టంట్స్: ప్రేమ్ సన్
==> కొరియోగ్రాఫర్ : మొయిన్ మాస్టర్
==> PRO : సాయి సతీష్, రాంబాబు
Also Read: Farmer: 'మెట్రో'లో రైతుకు ఘోర అవమానం.. 'మురికి బట్టలు' ఉన్నాయని రైలు ఎక్కనివ్వని సిబ్బంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter