దిశా అప్పుడు నగ్నంగా లేదు: ముంబై పోలీసుల క్లారిటీ
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసుతో పాటు ఆయన మాజీ మేనేజర్ దిశా సాలియన్ (Disha Salian Not Found Nude) అనుమానాస్పద మరణం ముంబై పోలీసులకు తలనొప్పిగా మారాయి. దిశా కేసులో తమకు వివరాలు ఇచ్చి సహకరించాలని కోరారు.
ముంబై పోలీసులను కలవరపెడుతున్న అంశాలు బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) ఆత్మహత్య కేసు, ఆయన మాజీ మేనేజర్ దిశా సాలియన్ (28) మరణం. సుశాంత్ కేసు తీవ్రత పెరిగేకొద్దీ దిశా సాలియన్ (Disha Salian) కేసుపై ఫోకస్ చేయాలని, ఆమెను కొందరు రేప్ చేసి హత్య చేశారని, చనిపోయినప్పుడు ఆమె మృతదేహంగా నగ్నంగా ఉందని ఆరోపణలొస్తున్నాయి. దీనిపై మాల్వాని పోలీస్ స్టేషన్‌కి చెందిన పోలీస్ అధికారి మరోసారి స్పష్టత ఇచ్చారు. చనిపోయినప్పుడు దిశా సాలియన్ నగ్నంగా లేదని, ఆమె ఒంటిపై బట్టలున్నాయని మరోసారి స్పష్టం చేశారు. రఫేల్ యుద్ధ విమానాలతో చైనాకు సంకేతాలు
COVID19 Symptoms: కరోనా పేషెంట్లలో ముఖ్యమైన లక్షణాలివే
వ్యక్తి ఆడ అయినా, మగ అయినా పోస్టుమార్టం నిర్వహించడానికి ముందు బట్టలు తొలగిస్తారని చెప్పారు. శరీరాన్ని పరిశీలించకుండా పోస్టుమార్టం నివేదిక ఎలా వస్తుందని ప్రశ్నించారు. దిశా పంచనామాను ఆమె కుటుంబ సభ్యుల సమక్షంలోనే చేశామన్నారు. అయితే జూన్ 8న దిశా అపార్ట్‌మెంట్ పై నుంచి పడిపోయి చనిపోయింది. అనుమానాస్పద కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.రానా ఇంట్లో సత్యనారాయణ వ్రతం, పూజలు
చనిపోయే ముందు తన ఫ్రెండ్‌కు కాల్ చేసి 45 నిమిషాలపాటు దిశా మాట్లాడిందని గుర్తించారు. ఆమెకు రావలసిన డీల్స్ రద్దయ్యాయని మానసిక వేదనను దిశా సాలియన్ అనుభవించినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఈ క్రమంలో జూన్ 14న ముంబై, బాంద్రాలోని తన అపార్ట్‌మెంట్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. ఈ రెండు కేసులకు లింక్ ఉందని కొందరు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని ముంబై పోలీసులు వెల్లడించారు. పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే...